Telangana - Local Guide NEWS

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు వచ్చారని అధికారులను నిలదీస్తున్న ప్రజలు. ఆస్తి పన్ను వసూలుకు సమయపాలన లేదా.... అప్పులోల్లా రాత్రిపూట వచ్చారని అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. . సమయపాలన లేకుండా ఆస్తిపన్ను వసూలు కోసం వెళ్లిన అధికారులు, సిబ్బందికి ఎదురవుతున్న చేదు అనుభవాలు. మార్చి 31వ తేదీ లోపు ఆస్తి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో రాత్రి,పగలనకా వసూళ్లకు వెళ్లిన అధికారులు సిబ్బంది. రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ): ఎంత రాత్రి అయినా సరే ఆస్తిపన్ను వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు, సిబ్బందికీ షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో చేదు అనుభవాలు ఎదురైనట్లు తెలిసింది. ఏడాది ఆర్థిక సంవత్సరం మార్చి 31 తో ముగియనుండటంతో ప్రభుత్వ ఆదేశాలను సారం మున్సిపల్ అధికారులు ముమ్మరంగా ఆస్తిపన్ను వసూళ్లకు దిగారు. మార్చీ 31 ఒక్క(చివరి ) రోజే గడువు ఉండటంతో రాత్రి పగలనకా కాలనీలు, బస్తీల్లో ఆస్తి పన్ను వసూలుకు వెళ్లిన అధికారులను ఆస్తిపన్నుదారులు కాలనీలో ఏం అభివృద్ధి చేశారని సమయపాలన లేకుండా ఆస్తిపన్ను వసూలుకు వచ్చారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. ఆస్తి పన్ను వసూలుకు వెళ్లిన కొందరు సిబ్బందికి ప్రజల నుంచి అనేక చేదు అనుభవాలు ఎదురైనట్లు కొందరు సిబ్బంది వాపోయారు. ఆస్తిపన్ను వసూలే టార్గెట్ గా విధులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో బిల్ కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది ఒకవైపు కమిషనర్ ఒత్తిడి... మరోవైపు ప్రజల నుంచి ఎదురయ్య చేదు అనుభవాలతో తీవ్ర ఒత్తిడికీ గురవుతున్నారు. ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నయని కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తిపన్ను వసూలు చేయాల్సిందే... ఎవ్వరు కూడా ఎలాంటి సెలవులు, పండుగలు ఇతర ఈ కార్యాలకు వెళ్ళేది లేదని కమిషనర్ తీవ్రమైన వత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏ బాధ వచ్చినా కూడా సెలవు పై వెళ్లలేని దుస్థితి నెలకొందని కొందరు ఉద్యోగులు వాపోయారు. ఆశపన్ను వసూలు కోసం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి వరకు ఎంత సమయం పడుతుందో.... ఎప్పుడు ఇంటికి వెళ్తాము తెలియని పరిస్థితులు నెలకొన్నాయని సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆస్తిపన్ను వసూళ్లకు ఎలాంటి సమయపాలన లేదా...? అప్పులు ఇచ్చినోళ్ళలా ఆస్తి పన్ను కోసం ఇల్ల చుట్టూ తిరుగుతున్నారని ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మా బస్తీలు, కాలనీలో ఏం అభివృద్ధి చేశారని రాత్రిపూట ఆస్తి పన్ను వసూళ్లకు వచ్చారని అధికారులు సిబ్బందిని ప్రజలు నిలదీసినట్లు సమాచారం. ఈ పని ఒత్తిడితో ఉద్యోగం కొనసాగించడం కష్టంగా మారిందని, అనారోగ్యాలపాకు గురవుతున్నట్లు కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. ఈ పనివత్తిడితో సమయానికి భోజనం చేయకపోవడమే కాకుండా కనీసం చాయ్, నీళ్లు తాగలేని పరిస్థితితులు నెలకొన్నాయి. అదనంగా పని చేసినప్పటికీ ఎలాంటి అదనపు జీతం లేదా అలవెన్స్‌లు ఇవ్వడం లేదని, పెట్రోల్ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో ఖర్చులు తమపై పడుతున్నాయని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీరామ నవమి పండుగ రోజున కూడా టాక్స్ కలెక్షన్ల కోసం తిరగాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లి వసూళ్లు చేయాల్సి రావడం వల్ల ప్రజలకు కూడా అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.

గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, మండుటెండల్లో కూడా ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేయాల్సి వస్తోందంటున్నారు.

హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
హైదరాబాద్, మార్చి 29: నగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ‘యువ భారత్ రన్ 2026’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS), పల్లవి స్కూల్స్ సంయుక్తంగా ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తనయుడు యశస్వి మల్కా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద యువత ఆధారిత ఫిట్‌నెస్ ఉద్యమంగా నిలిచింది. ఈ రన్‌లో 10,000 మందికి పైగా విద్యార్థులు, యువత, కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.

ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ రన్‌ ఫిట్ ఇండియా మూవ్మెంట్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మద్దతు అందించగా, రెడ్ ఎఫ్ఎం అధికారిక రేడియో భాగస్వామిగా వ్యవహరించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా 5 కిలోమీటర్ల ‘ది ఛాలెంజ్’ (టైమ్‌డ్ రన్), 2 కిలోమీటర్ల ‘రన్ అండ్ బాండ్’ (కుటుంబ సభ్యులు, ప్రారంభికుల కోసం), 500 మీటర్ల ‘యంగ్ రన్నర్స్’ (చిన్నారుల కోసం) విభాగాలు నిర్వహించారు. అన్ని వయసుల వారికి అనుకూలంగా ఈ విభాగాలను ఏర్పాటు చేయడం విశేషం.

రన్‌తో పాటు జుంబా, యోగా వార్మప్ సెషన్స్, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్, ప్లే జోన్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్ వంటి కార్యక్రమాలు పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి. టైమ్‌డ్ విభాగాల్లో విజేతలకు మొత్తం రూ.1 లక్ష నగదు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మాజీ ఉపరాష్ట్రపత శ్రీ వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు , సినీ నటుడు శర్వానంద్ తదితరులు హాజరయ్యారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కలిసి జెండా ఊపి 2కే, 5కే రన్‌లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు యువత ఆరోగ్యకరమైన అలవాట్లపై ఆధారపడి ఉందన్నారు. ఇది కేవలం పరుగే కాకుండా శక్తివంతమైన ప్రజా ఉద్యమమని అభివర్ణించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, యువతలో విదేశీ అలవాట్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాషలో మాట్లాడడం, తల్లిదండ్రులతో సమయం గడపడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు. ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు.

సోషల్ మీడియా వినియోగంపై కూడా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఉపయోగించాలని సూచించారు. మంచి ప్రవర్తన, క్రమశిక్షణతో జీవించడం ద్వారా భవిష్యత్తు మెరుగవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా యువతలో ఫిట్‌నెస్‌తో పాటు నైతిక విలువలు పెంపొందించాలనే లక్ష్యాన్ని నిర్వాహకులు విజయవంతంగా సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు.

శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం
హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకంగా ఉన్న రోడ్లు మరియు భవనాల (ఆర్‌&బీ) శాఖ పనితీరుపై ఈ రోజు శాసనసభలో సమగ్ర చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి Komatireddy Venkat Reddy సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రహదారుల నిర్మాణం, మరమ్మతులు, వంతెనలు మరియు ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పురోగతిని మంత్రి వివరించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో రహదారి సదుపాయాల మెరుగుదల, ప్రధాన రహదారుల విస్తరణ, నాణ్యత ప్రమాణాల అమలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు సమాచారం.

అలాగే, ఆర్‌&బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితి, పూర్తయిన ప్రాజెక్టులు, కొనసాగుతున్న పనులు మరియు రాబోయే కాలానికి సంబంధించిన లక్ష్యాలను సభకు వివరించనున్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి ప్రస్తావించనున్నారు.

ఇకపై చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, బడ్జెట్ వినియోగం, పనుల వేగవంతం, పారదర్శకత మరియు సమయపాలనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది.

ఈ చర్చతో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ దిశానిర్దేశం స్పష్టమవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఎర్త్ అవర్‌లో భాగంగా లోక్ భవన్‌లో గంటపాటు దీపాల ఆర్పివేత
హైదరాబాద్, మార్చి 28: పర్యావరణ పరిరక్షణ, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) పై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించే ‘ఎర్త్ అవర్’ కార్యక్రమంలో లోక్ భవన్ భాగస్వామ్యమైంది.

ఈ సందర్భంగా శనివారం రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు లోక్ భవన్ పరిధిలోని ప్రధాన భవనం, సిబ్బంది నివాస సముదాయం, అధికారుల క్వార్టర్స్, పరిపాలనా భవనాల్లో ఒక గంటపాటు విద్యుత్ దీపాలను నిలిపివేశారు.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా, ఈ ఏడాది “గివ్ అన అవర్ ఫర్ ఎర్త్” అనే థీమ్‌కు అనుగుణంగా దీపాలను ఆర్పివేసి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతును తెలియజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం
భద్రాచలం, మార్చి 28: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి శ్రీమతి జానకి శుక్లా దంపతులు తిలకించి, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ మహోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు హాజరయ్యారు.

భద్రాచలం పర్యటనకు తొలిసారిగా విచ్చేసిన గవర్నర్ దంపతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలీప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో స్వాగతం తెలిపారు.

ఈ సందర్భంగా గవర్నర్ భద్రాచలంలో ఐటిడిఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భద్రగిరి మార్ట్’ను ప్రారంభించారు. మార్ట్‌లో గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించిన గవర్నర్ దంపతులు, వాటి వివరాలను ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్, సహాయ ప్రాజెక్ట్ అధికారి డేవిడ్‌ల నుంచి తెలుసుకున్నారు. అనంతరం పలు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేశారు.

ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని, శ్రీ సీతారాముల దివ్య దర్శనం పొందారు.

మౌలిక వసతుల కల్పనకు కృషి.
లోకల్ గైడ్/ తాండూర్:
వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచిన వెంటనే మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి అంజాద్ అలీ పాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న బల్దియా ఎన్నికల్లో 31 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు దీవిస్తే తక్షణమే వార్డు సమస్యలపై పోరాడుతున్నానని అన్నారు. 31 వ వార్డులో తాగునీరు,మురుగు , రోడ్డు సమస్య అధికంగా ఉందని, తక్షణమే వాటిని పరిష్కరిస్తానని భరోసానిచ్చారు.ముఖ్యంగా మురుగు సమస్యను నివారించేందుకు అండర్ డ్రైన్ వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేస్తానని స్పష్టికరించారు.

రేపటి సీఎం రేవంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గ పర్యటనను జయప్రదం చేయండి : తుంబూరు దయాకర్ రెడ్డి పిలుపు
లోకల్ గైడ్ పాలేరు: మన ప్రియతమ నేత, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మన పాలేరు  నియోజకవర్గంలో ఈ నెల 18న ఆదివారం (రేపు) ఉదయం 10:30 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పర్యటించనున్నారు. ఈ పర్యటనను భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పొంగులేటి గారి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

మద్దులపల్లి వేదికగా సీఎం గారు 100 పడకల ఆసుపత్రి (కూసుమంచి), జేఎన్టీయూ కళాశాల, మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే నర్సింగ్ కళాశాల మరియు కొత్త వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని  ఆత్మ కమిటీ, సీడీసీ, మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, దేవాలయ కమిటీ బాధ్యులు మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ ఉదయం 10:30 గంటలకే హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

అనుమతులు లేకుండా దుకాణాల నిర్మాణం.
లోకల్ గైడ్/తాండూర్:

తాండూర్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భాగివి భద్రేశ్వర దేవాలయ దుకాణ సముదాయాల నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినట్లు వీరశైవ సమాజ సభ్యులు ప్రవీణ్ పటేల్ ఆరోపించారు.ఈ సందర్భంగా ప్రవీణ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ….. దేవాలయ కమిటీ ఈఓ కుమ్మక్కై దాదాపు రూ. 3.5 కోట్ల విలువైన దుకాణాలను అక్రమంగా నిర్మించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి దేవాలయ ఆదాయానికి గండి కొట్టారు అని ఆరోపించారు.​   ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం 5ఏళ్లకు ఒక సారి రిటైడర్లు వెయ్యాల్సి ఉంది. కానీ లైఫ్దే టైం సెటిల్మెంట్   అని వసూళ్లు చేపట్టారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదాయ శాఖ     చట్టం ప్రకారం వెంటనే పబ్లిక్ నోటిఫికేషన్ విడుదల చేయాలని,​అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్లను వెంటనే దేవాదాయ శాఖ ఖాతాలో జమ చేయాలన్నారు. నియమ నిబంధనలు పాటించని అధికారులపై, రెవల్యూషన్ కమిటీపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.​కోర్టు ఆదేశాల నేపథ్యంలో, అధికారులు రంగంలోకి దిగి దుకాణాలను మూసివేయించారు. సరైన అనుమతులు పొంది, చట్టబద్ధంగా ప్రక్రియ పూర్తి చేసే వరకు ఈ దుకాణాలు తెరిచే ప్రసక్తి లేదని హెచ్చరించారు.

25వ డివిజన్లో ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతులకు బహుమతి ప్రధానం
ఖమ్మం:లోకల్ గైడ్:
ఖమ్మం : 25వ డివిజన్ రిక్క బజార్ సెంటర్ అమ్మ భవాని గుడి దగ్గర స్థానిక కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా జరిగిన ముగ్గుల పోట్లలో గెలుపొందిన విజేతులకు బహుమతి ప్రధానం చేశారు . మొదటి బహుమతి వెండి దీపపు కుండీలు , రెండవ బహుమతి గ్రైండర్ , మూడవ బహుమతి మిక్సీ మరియు ముగ్గుల పోటీలో పాల్గొన్న ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి సుమారుగా 500 మందికి పట్టు చీరలు అందజేశారు . ఈ కార్యక్రమాన్ని సహకరించి  విజయవంతం చేసిన డివిజన్ ప్రజలకు , నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు .

విద్యార్థులకు పారిశుధ్యం పై అవగాహన అవసరం
శంషాబాద్ ,జనవరి 17( లోకల్ గైడ్);
జీహెచ్‌ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని శంషాబాద్ సర్కిల్–18లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా శనివారం శంషాబాద్ ప్రభుత్వ బాలికల హై స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె. చంద్రకళ మాట్లాడుతూ, మూలంలోనే చెత్త వేరు చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నిషేధం, యొక్క ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ హరిత వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులతో పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బి. సుమన్ రావు , డిప్యూటీ ఈఈ  అన్నపూర్ణ ,  ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటెం ఎండ్.

సబ్బండ వర్గాల అభివృద్ధియే ప్రజాప్రభుత్వం ప్రధాన ధ్యేయం.
నిర్మల్ : లోకల్ గైడ్ :

సబ్బండ వర్గాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా నూతన రేషన్ కార్డులు అందివ్వడంతోపాటు, ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్న బియ్యం వంటి ఎన్నో రకాల పథకాలతో రాష్ట్ర ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా, మహిళా సంఘాల సభ్యులను వెయ్యి బస్సులకు యజమానులను చేశామని గుర్తు చేశారు. వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూమిని హైదరాబాద్ నడి బొడ్డున మహిళా సంఘాలకు కేటాయించి, వారి ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లా ప్రజల కోరిక మేరకు బాసరలో యూనివర్సిటీను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సంపూర్ణంగా సాగునీరు అందిస్తామని వెల్లడించారు. ఇండ్లు లేని పేదలకు నిలువ నీడ కల్పించేందుకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని అన్నారు. రైతులకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. అదిలాబాద్ జిల్లాలో పదివేల ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడను నెలకొల్పుతామని చెప్పారు. దీని ద్వారా జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాతో సమానంగా నిర్మల్ జిల్లాకు నిధులు కేటాయించి జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, జిల్లా అభివృద్ధికి  చర్యలు తీసుకుంటామని తెలిపారు. చనక కొరాట, సదర్మాట్ బ్యారేజీల ద్వారా వీడు భూములు సస్య శ్యామలమవుతాయని తెలిపారు.
అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా సంఘాలకు రుణాల చెక్కులను ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ లు కలిసి అందించారు. నిర్మల్ ఉత్సవాల గోడ ప్రతులను ఆవిష్కరించారు.

రైతాంగానికి సంపూర్ణంగా సాగునీరు అందిస్తాం.

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.

రాష్ట్రంలోని రైతాంగానికి సంపూర్ణంగా సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి సాగునీరు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నింటిని ఆధునికరిస్తామని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మిగిలి ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదవారికి అందరికీ నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు:

జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పేదల ఉన్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇల్లు లేని పేద వారందరికీ సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు.

అంతకుముందు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ ఆధునీకరించాలని కోరారు. నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని తెలిపారు. జెడ్పి భవన నిర్మాణం తో పాటు, రోడ్లు, వంతెనల నిర్మాణాలు మరమ్మత్తులు చేయాలని చెప్పారు. నిర్మల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన మేర నిధులు కేటాయించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విటల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, పవార్ రామారావు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఖానాపురం, త్రీటౌన్ సీఐల చేతుల మీదుగా లోకల్ గైడ్ తెలంగాణ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
ఖమ్మం : లోకల్ గైడ్ :
ఖమ్మం పట్టణంలో ఉన్న కానాపురం హవేలీ సీఐ, త్రీటౌన్  సీఐలతో  లోకల్ తెలంగాణ దినపత్రిక ఖమ్మం బ్యూరో, జిల్లా స్టాఫర్, ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యంలో లోకల్ గైడ్ దినపత్రిక నూతన క్యాలెండర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇరు సీఐలు లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక పై ప్రశంసలు కురిపించారు. లోకల్ గైడ్ పత్రిక ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోందని వారు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల సమస్యలపై పత్రిక ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని పేర్కొన్నారు.
సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని నిజమైన వార్తలను ప్రచురిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్న లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీఐలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లోకల్ గైడ్ పత్రిక ప్రతినిధులు ఖమ్మం జిల్లా బ్యూరో ఎండి పసిద్దిన్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కే దాస్, ఫోటోగ్రాఫర్ ప్రసాద్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.