Adilabad - Local Guide NEWS

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్ లోకల్ గైడ్ ఆగస్టు

విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం స్థానిక బొక్కల్‌గూడ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన నూతన అదనపు తరగతి గదులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

అనంతరం కళాశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటి నీరు పోశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా జిల్లా అకడమిక్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అత్యధికంగా 1,200 మంది విద్యార్థులతో నాలుగు మీడియాలలో విద్యాబోధన సాగుతున్న ఈ కళాశాల జిల్లాకే తలమానికమని కొనియాడారు. అసంపూర్తిగా ఉన్న మొదటి అంతస్తులోని నాలుగు నూతన గదులను ఖర్చుకు వెనుకాడకుండా పూర్తి చేసి నేడు ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు.
విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలోనే ఉండి ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా అభ్యసించాలని సూచించారు. తరగతులకు క్రమం తప్పకుండా హాజరైతేనే సబ్జెక్టులపై పూర్తి పట్టు లభిస్తుందని, తద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. అలాగే, కళాశాలలో అందుబాటులో ఉన్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (IFP) ద్వారా నీట్, ఎంసెట్ వంటి ఉన్నత స్థాయి పోటీ పరీక్షలకు అవసరమైన డిజిటల్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ర్యాంకులు సాధించి, కళాశాలకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ, విద్యతోనే భవిష్యత్ ఉందని, అధ్యాపకులను గౌరవించి సలహాలు సూచనలు పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క చొప్పున నాటి సమీక్షించాలని అన్నారు.

అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమంటో లను కలెక్టర్, అతిథులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డీఐఈవో గణేష్ జాదవ్, డీఎంబ్ల్యూవో కలీం, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు సుచిక, సుష్మా, సంజయ్, జీవన్, ఇతర అధికారులు, అధ్యాపకులు,  విద్యార్థులు పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఆదిలాబాద్ లోకల్ గైడ్ ఉట్నూరు ఆగస్టు

దివ్యాంగుల సమగ్ర వికాసం, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం  ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్‌లో మహిళా శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో దివ్యాంగులు ఎవరిపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను, పరికరాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు అవసరమైన ఆధునిక పరికరాలు, సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, సమాజంలో వారు ఎవరిపైనా ఆధారపడకుండా ముందుకు సాగేందుకు ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం దివ్యాంగులకు  30.68 లక్షల విలువగల 26 ఉపకరణాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, పలువురుప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

చదువుతోనే ఉన్నత భవిష్యత్తు.. విద్యార్థులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచన
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోకల్ గైడ్ ఆగస్టు 20
ఉట్నూర్ మండలం:- ఉట్నూర్ మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు.

విద్యార్థుల నుంచి వారి విద్యా సమస్యలు, కళాశాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరమైన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారు మాట్లాడుతూ విద్యార్థి దశే జీవితానికి బలమైన పునాది అని, ఈ సమయంలో కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. సాంకేతిక విద్య ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకుని, భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

అలాగే చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని, సమయాన్ని వృథా చేయకుండా చదువు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారిని కళాశాల సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్,ఆపే కుట్రను సహించం: జోగు రామన్న
అదిలాబాద్ జిల్లా లోకల్ గైడ్ ఆగస్టు 18
ఆదిలాబాద్: పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ఎలాంటి కారణాలతోనైనా నిలిపివేయడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు జోగు రామన్న మండిపడ్డారు. మంగళవారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న గారి ఆధ్వర్యంలో  నిరసన దీక్ష కార్యక్రమాన్ని దాదాపు 3000 మంది  మహిళలతో పాటు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు . జిల్లా బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బయట నుంచి నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ రోడ్డు మార్గాన్ని దిగ్బంధించారు. వాహనాలను నిలిపేశారు.. అనంతరం జోగు రామన్న గారు మాట్లాడుతూ   ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ ప్రజల్లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రోత్సస్తుందని   దుయ్యబట్టారు. హైడ్రా భూ కబ్జాలకు లాయర్లను పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం  కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎత్తివేస్తుంటే మంచి లాయర్లను పెట్టకుండా చోద్యం చూస్తూ తప్పించుకునే విత్తనాలు చేస్తుందని మండిపడ్డారు..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రమే కాదని, పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి సమయంలో అండగా నిలిచే సామాజిక భరోసా అనిజోగు రామన్న అన్నారు. పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టి, దశలవారీగా ఆర్థిక సాయాన్ని పెంచిందని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఈ పథకాల అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో పేద కుటుంబాల్లో ఆందోళన నెలకొందని జోగు రామన్న వేదన వ్యక్తం చేశారు..ప్రభుత్వం కోర్టులో తన వైఖరిని స్పష్టంగా వెల్లడించి, పథకాలు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“కోర్టును సాకుగా చూపించి పేదల సంక్షేమాన్ని పక్కన పెట్టొద్దు”కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేద ఆడబిడ్డల వివాహానికి మరింత ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు పథకం అమలుపై అనిశ్చితి ఏర్పడటానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని జోగు రామన్న అన్నారు.
పథకానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం సమర్థవంతంగా కోర్టు ముందు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే, పేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే తన న్యాయపరమైన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని బలహీనపరిచే ఏ ప్రయత్నాన్నీ బీఆర్‌ఎస్‌ సహించదని స్పష్టం చేశారు.
అవసరమైతే పేద కుటుంబాలు, మహిళల తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జోగు రామన్న హెచ్చరించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు కొనసాగి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రయోజనం అందే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పేద మహిళలకు అండగా ఉండే మహోన్నత పథకాన్ని  కనుమరుగు చేసే యత్నం చేస్తే  పేదల పక్షం బి ఆర్ఎస్ పార్టీ నిరసన పోరాట కార్యక్రమాలను చేపట్టి  కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, ఇజగిరి నారాయణ, సాజితోద్దీన్ యూనిస్ అక్బాని, స్వరూప రాణి, బోడగం మమత,పర్వీన్,గండ్రత్ రమేష్, సేవ్వా జగదీష్,వెనుగంటి ప్రకాష్, ఆత్రం వెంకటేష్, సలీమ్,అంజలి అనిల్,dr గౌష్,అన్నెలా వసంత్, ధర్మపాల్, బట్టు సతీష్, కరుణ, తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పెండింగ్లో ఉంచకూడదు.
అదిలాబాద్ లోకల్ గైడ్ ఆగస్టు 17

ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండ చూడలిఅత్యంత ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలనీ అదనపు కలెక్టర్లు రాజేశ్వర్పత్రికా ప్రకటన

ఆగస్టు 17-2026 - ఆదిలాబాద్

ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా అత్యంత ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలనీ అదనపు కలెక్టర్లు రాజేశ్వర్ ఆర్ఎస్ చిత్రు,అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు  మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును సునిశితంగా పరిశీలించి శాఖల వారీగా సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్లు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు, భూమికి సంబంధించిన సమస్యలపైనే అధికంగా వినతులు నమోదయ్యాయని వెల్లడించారు. అందిన అర్జీలను వెంటనే సంబంధిత శాఖలకు పంపించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ స్రవంతి, డిఆర్డిఏ రవీందర్ రాథోడ్, ఏవో వర్ణ,వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్ఎస్ చిత్రు,అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు  మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును సునిశితంగా పరిశీలించి శాఖల వారీగా సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్లు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు, భూమికి సంబంధించిన సమస్యలపైనే అధికంగా వినతులు నమోదయ్యాయని వెల్లడించారు. అందిన అర్జీలను వెంటనే సంబంధిత శాఖలకు పంపించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ స్రవంతి, డిఆర్డిఏ రవీందర్ రాథోడ్, ఏవో వర్ణ,వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సీసీఐ పునఃప్రారంభం కోసం చేసిన ఉద్యమాల ఫలితంగానే
అదిలాబాద్ లోకల్ గైడ్ ఆగస్టు 13:

ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం  గతంలో 2014 నుండి 2016 మరియు నేటి వరకు జోగు రామన్న గారు మంత్రిగా కొనసాగిన సమయంలో ఆయన చేసిన కృషి మరియు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్‌కు వచ్చారని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ అన్నారు. ఇది నిజం కాదా? అని ఆయన మీడియా ముఖంగా ప్రశ్నించారు.
గురువారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శనాల మల్లేష్ మాట్లాడారు. 2014 నుంచి సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం మాజీ మంత్రి జోగు రామన్న, సాధన సమితి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు.
ప్రొఫెసర్ కాసిం మాట్లాడిన వీడియోలను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసే ముందు తమ పార్టీ విజ్ఞతపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభంపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సీసీఐ పరిశ్రమపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సింది పోయి, లోపాయకారి ఒప్పందాలపై మీడియా ముందు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు ఇవ్వడం లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి సీసీఐ పునఃప్రారంభానికి కృషి చేయకుండా కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పర విమర్శలకు దిగడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను అభాసుపాలు చేసేలా జిల్లా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన పోరగర్జన కార్యక్రమం విజయవంతం కావడం గిట్టని కొందరు కాంగ్రెస్, బీజేపీ నాయకులు సీసీఐ సాధన సమితిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని మల్లేష్ డిమాండ్ చేశారు.CCI సాధన కమిటీ మీడియా సమావేశంలో
దర్శనాల మల్లేష్  - కన్వీనర్
విజ్జగిరి నారాయణ - కో - కన్వీనర్ కో - కన్వీనర్స్ --
కొండ రమేష్
లోకారి పోశెట్టి
వెంకట నారాయణ
S. అరుణ్ కుమార్
జగన్ సింగ్ సభ్యులు బండి దత్తాత్రి దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సబ్బండ వర్గాల అభివృద్ధియే ప్రజాప్రభుత్వం ప్రధాన ధ్యేయం.
నిర్మల్ : లోకల్ గైడ్ :

సబ్బండ వర్గాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా నూతన రేషన్ కార్డులు అందివ్వడంతోపాటు, ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్న బియ్యం వంటి ఎన్నో రకాల పథకాలతో రాష్ట్ర ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా, మహిళా సంఘాల సభ్యులను వెయ్యి బస్సులకు యజమానులను చేశామని గుర్తు చేశారు. వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూమిని హైదరాబాద్ నడి బొడ్డున మహిళా సంఘాలకు కేటాయించి, వారి ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లా ప్రజల కోరిక మేరకు బాసరలో యూనివర్సిటీను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సంపూర్ణంగా సాగునీరు అందిస్తామని వెల్లడించారు. ఇండ్లు లేని పేదలకు నిలువ నీడ కల్పించేందుకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని అన్నారు. రైతులకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. అదిలాబాద్ జిల్లాలో పదివేల ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడను నెలకొల్పుతామని చెప్పారు. దీని ద్వారా జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాతో సమానంగా నిర్మల్ జిల్లాకు నిధులు కేటాయించి జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, జిల్లా అభివృద్ధికి  చర్యలు తీసుకుంటామని తెలిపారు. చనక కొరాట, సదర్మాట్ బ్యారేజీల ద్వారా వీడు భూములు సస్య శ్యామలమవుతాయని తెలిపారు.
అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా సంఘాలకు రుణాల చెక్కులను ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ లు కలిసి అందించారు. నిర్మల్ ఉత్సవాల గోడ ప్రతులను ఆవిష్కరించారు.

రైతాంగానికి సంపూర్ణంగా సాగునీరు అందిస్తాం.

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.

రాష్ట్రంలోని రైతాంగానికి సంపూర్ణంగా సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి సాగునీరు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నింటిని ఆధునికరిస్తామని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మిగిలి ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదవారికి అందరికీ నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు:

జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పేదల ఉన్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇల్లు లేని పేద వారందరికీ సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు.

అంతకుముందు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ ఆధునీకరించాలని కోరారు. నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని తెలిపారు. జెడ్పి భవన నిర్మాణం తో పాటు, రోడ్లు, వంతెనల నిర్మాణాలు మరమ్మత్తులు చేయాలని చెప్పారు. నిర్మల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన మేర నిధులు కేటాయించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విటల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, పవార్ రామారావు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.