Nizamabad - Local Guide NEWS

నిజామాబాద్ లో గవర్నర్ కు ఘన స్వాగతం
నిజామాబాదు కు ఒక పర్యటనకు రాష్ట్ర గవర్నర్ సి.శివ్ ప్రతాప్ శుక్లా కు ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా నిజామాబాద్ కు చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ హాజరయ్యారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్ వద్ద గవర్నర్ కు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ సురేష్ తదితరులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.
అక్కడి నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కాన్వాయ్ ద్వారా గవర్నర్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

అనంతతం జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. జాతీయ, రాష్ట్ర గేయాలపన అనంతరం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పసుపు రైతులతో భేటీ అయ్యారు. ఎం.పీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పసుపు బోర్డు చైర్మన్ పి.గంగారెడ్డి, సెక్రటరీ ఎన్.భవానీశ్రీ, డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యూష్ తదితరులతో కలిసి సునేహరి  మిట్టి అభియాన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ నెల 25 న నిజామాబాదు కు తెలంగాణ గవర్నర్ రాక
నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 24:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆగస్టు 25న (మంగళవారం) నిజామాబాద్ జిల్లా లో పర్యటించనున్నారు. నగరంలోని పసుపుబోర్డు కార్యాలయంలో రైతులతో మార్కెట్​ లింకేజ్​ కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రోజు
ఉదయం 10.20 గంటలకు ఇందూరుకు వస్తారు . ఆగస్టు 25న ఉదయం 9:15 గంటలకు లోక్ భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ ఐడీవోసీ హెలిప్యాడ్‌కు 10:20 గంటలకు వస్తారు. ఆ తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, నేషనల్ టర్మరిక్​ బోర్డులో రైతులతో మార్కెట్ లింకేజ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం పీహెచ్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్​లో అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చేపట్టనున్న ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సాయంత్రం 3:20 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 22:

రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూప‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం చేప‌ట్గిన భూ రీస‌ర్వేను వేగవంతం చేయాల‌ని    రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఏడాదిన్న‌ర లోపు వ్య‌వ‌సాయ భూముల‌తోపాటు ఆబాదీ ఆస్తుల రీసర్వే పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు.
శ‌నివారం నాడు ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించి ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్ధాప‌న చేశారు. నాగారంలోని నిర్మితి కేంద్రంలో ఇందిర‌మ్మ హౌసింగ్ ట‌వ‌ర్స్ కోసం స్ధ‌లాన్ని ప‌రిశీలించారు. అలాగే పాముల బ‌స్తీలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు.
ఆ త‌ర్వాత డ‌బుల్ బెడ్ రూమ్ ల‌బ్దిదారుల‌కు ఇళ్ళ ప‌ట్టాలు అంద‌జేశారు. అనంతరం క‌లెక్ట‌రేట్‌లో  నిజామాబాద్, కామారెడ్డి  జిల్లాల రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజలను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పదేపదే సూచించినా పనితీరులో మార్పు రాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, సాదాబైనామా అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తున్న తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం రీ సర్వే చేపడుతోందని తెలిపారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాది ఆస్తుల రీ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందన్నారు.
రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని  అన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా, పట్టణం, గ్రామం, గూడెం, తండా అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు.
పట్టణాలు, నగరాల్లో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల కోసం హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే నిజామాబాద్‌లో ప్రయోగాత్మకంగా టవర్స్ నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ వ్యయం తగ్గించేందుకు సిమెంట్ బ్యాగ్‌ను కేవలం రూ.230కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు. పేద కుటుంబాలపై నిర్మాణ భారం తగ్గించడంతో పాటు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
43వ డివిజన్‌లోని పాముల బస్తీలో ఇందిరమ్మ పథకం కింద నిర్మాణం పూర్తయిన ఇళ్లను  పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లులు సకాలంలో అందుతున్నాయా, నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తమ సొంతింటి కలను సాకారం చేసిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.
లబ్ధిదారుల సంతోషంలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి పేర్కొంటూ, నూతన గృహ ప్రవేశం చేసుకున్న కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన వస్త్రాలను బహూకరించారు. చివరి దశలో ఉన్న ఇళ్లను కూడా పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఐడీఓసీని ఆనుకుని నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి పరిశీలించారు. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నిధుల కొరత లేదని, పనులు పూర్తయిన 24 గంటల్లోనే బిల్లులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ భవన సముదాయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హౌసింగ్ శాఖకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, పారిశుధ్య పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 400 మంది లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి చేతుల మీదుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు. మరో వారం, పది రోజుల్లో మరో 300 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తామని మంత్రి వెల్లడించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులు పూర్తి పారదర్శకంగా, అర్హత ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు, హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లను కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 8 లక్షల ఇళ్లకు మంజూరు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం అయ్యే వరకు విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో పేదలకు తగిన స్థాయిలో ఇళ్లు నిర్మించలేదని విమర్శించిన మంత్రి, గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యతను ప్రజా ప్రభుత్వం తీసుకుందని తెలిపారు.
ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, హౌసింగ్ శాఖ ఎండీ గౌతమ్, కలెక్టర్ భవేష్ మిశ్రా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 22:

రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, రైతులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా యూరియా అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి డిమాండ్ చేశారు.  యూరియా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ విధానం రైతులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోందని పేర్కొన్నారు.  స్మార్ట్ ఫోన్లు వాడకంలో లేని రైతులు, పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులు, డిజిటల్ పరిజ్ఞానం కాని రైతులు ఈ యాప్ ద్వారా ఎరువులు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు, సర్వర్ డౌన్ సమస్యల వల్ల ఎరువులు సకాలంలో అందడం లేదని, వెంటనే యాప్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. పాత మాన్యువల్ విధానం ద్వారా ఎరువుల దుకాణాల వద్దే నేరుగా పాత పద్ధతిలో యూరియా కాంప్లెక్స్ ఎరువులు అందజేయాలని, పట్టాదారు పాస్ బుక్ నిబంధనలను సడలింపు చేసి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులందరికీ యూరియా, కాంప్లెక్స్ ఎరువులను అందజేయాలని అయన కోరారు.

తహసిల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాలకు మంత్రిచే శంకుస్థాపనలు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగస్టు 22 :

నిజామాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు మంజూరైన నూతన తహసీల్దార్ కార్యాలయాల భవనాలతో పాటు నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి లోకేష్ కుమార్, స్పెషల్ సెక్రెటరి రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎం డీ గౌతమ్, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాదు నగరంలో విషాదం...
నిజామాబాద్​ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 20:

పొట్టకూటి కోసం కూలీ పనుల కై వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని నాల్గో టౌన్ పరిధిలోని వినాయక్​నగర్​లో ఓ ఇంటిపై ఉన్న గోడను కూల్చివేసేందుకు బోధన్​ నుంచి వచ్చిన అడ్డా కూలీ వెళ్లాడు. అయితే గోడను కూలగొట్టే క్రమంలో అకస్మాత్తుగా అది అతడిపై పడింది. దీంతో అక్కడికక్కడే సదరు కూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న నాల్గో టౌన్​ ఎస్​హెచ్​వో సతీష్​ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఎస్సై సాయన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్​కు తరలించారు.

స్మశాన వాటిక భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగస్టు 20:
నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామానికి చెందిన దళిత స్మశాన వాటికకు సంబంధించిన భూమిని ఆక్రమణకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన దళితులు గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
గ్రామంలోని సర్వే నంబర్ 612లో ఉన్న స్మశాన వాటిక భూమిని ఒకే కుటుంబానికి చెందిన తోట పెంటన్న, తోట గణేష్‌లు ఆక్రమించారని వినతిపత్రంలో పేర్కొన్నారు. స్మశాన వాటిక భూమి విషయంలో ప్రశ్నించేందుకు వెళ్లిన దళితులను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు.
గతంలో స్మశాన వాటిక భూమిని పరిరక్షించేందుకు ప్రయత్నించిన దళిత గోసంగిలపై కూడా కేసులు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు. దళిత గోసంగి స్మశాన వాటిక భూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఈ విషయంలో అధికారులు వెంటనే జోక్యం చేసుకుని భూమిని పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని కోరారు.
స్మశాన వాటిక భూమి విషయంలో సమగ్ర విచారణ జరిపి, భూమిని పరిరక్షించడంతో పాటు ఆక్రమణకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను వారు కోరారు.
ఈ సమస్యపై తక్షణమే రెవెన్యూ అధికారులతో సర్వే నిర్వహించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించి, దళితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సి 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి గంధం రాజేష్, బేడ బుడగ జంగం జన సంఘం జిల్లా అధ్యక్షులు డొక్క రంజిత్, ఉపాధ్యక్షులు సదుల రాజేశ్వర్, మాజీ సర్పంచులు కర్రే లింగస్వామి, కర్రే గంగయ్య  గోసంగి కులస్తులు నడిపి సాయిలు, కర్రే రాజన్న, రాసుల గంగాధర్, గంగయ్య లతో పాటు 50మంది దళిత గోసంగి కులస్తులు పాల్గొన్నారు.

నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా రాజా గౌడ్
నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 19:
నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా రాజా గౌడ్‌ బదిలీపై రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌)గా విధులు నిర్వహిస్తున్న రాజా గౌడ్‌ను నిజామాబాద్ అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా ప్రభుత్వం నియమించింది. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో బోధన్‌ ఆర్డీవోగా పనిచేశారు. దీంతో నిజామాబాద్‌ జిల్లా భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ వ్యవస్థపై ఆయనకు ఇప్పటికే అవగాహన ఉంది. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ప్రస్తుత బాధ్యతల్లో ఉపయోగపడుతుందని అధికారులు, సిబ్బంది భావిస్తున్నారు.

రెవెన్యూ పరిపాలన, భూసంబంధిత అంశాలు, ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.

జిల్లా ఇంచార్జి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్,ఆగస్టు 19 : నిజామాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి డి.అనసూయ (సీతక్క)ను కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీలకు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. వారితో కొద్దిసేపు భేటీ అయ్యి పలు అంశాల పై చర్చించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ / సబ్ - ఇన్స్పెక్టర్ పోస్టులకు ఉచిత శిక్షణ
నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 18:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్  డివిజన్ పరిధిలో గల నిరుద్యోగ యువతి ,  యువకులకు అర్హత కలిగిన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ నియామకాలకు ఉపయోగపడే విధంగా  ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంద ని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య తెలియజేశారు.

ముఖ్య వివరాలు:

1. దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా అందించబడే *Google Form లింక్ క్యూ ఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు ఫారం దరఖాస్తు చేసుకోవలెను.

2. స్క్రీనింగ్ టెస్ట్:
ఆగష్టు 23 న (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు
1) నిజామాబాద్ డివిజన్ వారు విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ మాక్లూర్ పోలీస్ స్టేషన్ యందు
2) ఆర్మూర్ డివిజన్ వారు క్షత్రియ ఇంజనీర్ కాలేజీ యందు
3) బోధన్ డివిజన్ వారు జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజీ యందు

పరీక్షా విధానం :

ఆబ్జెక్టివ్ విధానం లో 200 మార్కులకు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పైన తెలియజేసిన సెంటర్స్ నందు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించబడుతుందని వివరించారు .

3. శిక్షణ ప్రారంభం:
స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 01 నుండి అక్టోబర్ 31 వరకు శిక్షణలో పాల్గొనవచ్చని తెలిపారు.

4. శిక్షణ సమయం :

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకూ.
2 నెలల శిక్షణ కాలంలో 10 గ్రాండ్  టెస్ట్ లు నిర్వహించబదునని, అందరు అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడుతుందని తెలిపారు .

5. ఫీజు:

ఇది పూర్తిగా ఉచిత కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.

గమనిక  :

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి సమాచారానికైనా ఈ దిగువ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరని సి పి తెలిపారు .  క్రాంతి : 9951943656 , 8712533273

లింగ నిర్ధారణ పరీక్షలపై ఉక్కుపాదం మోపాలి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగస్టు 18 : పుట్టబోయే శిశువు అమ్మాయా, అబ్బాయా అని తెలియజేసేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పుట్టబోయేది ఆడ శిశువు అని నిర్ధారణ చేసి, గర్భవిచ్చిత్తికి పాల్పడడం క్షమించరాని నేరమని, ఇది ఎంతో శోచనీయమని అన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడే వారిని ఎంతమాత్రం ఉపెక్షించకుండా, బాధ్యులపై ఎం.టి.పి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీ.సీ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం గర్భస్థపూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లింగ నిర్ధారణ పరీక్షల నిరోధానికి చేపడుతున్న చర్యల విషయమై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకుని నివేదికలు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నామ్ కే వాస్తేగా సమావేశాలు నిర్వహించి తీర్మానాలు రాసుకోవడంతోనే సరిపెట్టుకోకుండా, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న స్కానింగ్ కేంద్రాలపై క్షేత్ర స్థాయిలో గట్టి నిఘా ఉంచాలని అన్నారు. జనన వివరాలను అనుసరిస్తూ ఆడ, మగ నిష్పత్తిలో ఎక్కువ వ్యత్యాసం ఉంటే, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, భ్రూణ హత్యలు జరుగుతున్నట్లు భావించాల్సి వస్తుందన్నారు. ఈ తరహ వ్యత్యాసం ఎక్కువగా నగరాలు, పట్టణ ప్రాంతాలలోనే కనిపిస్తోందని, దీనిని బట్టి గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు జరుగుతున్నట్లు తెలుస్తోందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచితే ఈ తరహా అమానవీయ ఘటనలకు ఆస్కారం ఉండదని సూచించారు. ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా, వాటి అమలు సక్రమంగా లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇకపై జిల్లాలో ఎక్కడ కూడా లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు జరుగకుండా గట్టి నిఘా పెట్టాలని, నిబంధలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని, స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భం దాల్చిన నాటి నుండి గర్భిణీల వివరాలను పక్కాగా నమోదు చేయాలని, వారిలో ఎంతమందికి కాన్పు జరిగిందన్నది పరిశీలించాలన్నారు. గర్భం దాల్చిన మీదట కాన్పు జరగని కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తే, గర్భ నిర్ధారణ, గర్భ విచ్చిత్తి ఘటనలను గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని, తద్వారా ఈ చర్యలకు పాల్పడిన స్కానింగ్ సెంటర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పక్కాగా నిబంధనలు పాటించే స్కానింగ్ కేంద్రాలకే లైసెన్సులు రెన్యూవల్ చేయాలని ఆదేశించారు. పి.సి.పి.ఎన్.డి.టి, ఎం.టి.పీ చట్టాలను ఉల్లంఘించడం వల్ల సమాజంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతున్నదని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. పుట్టబోయే శిశువు ఆడ, మగ ఎవరైనా సరే, అందరూ సమానమే అని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, కమిటీ సభ్యులు ఎస్.సిద్దయ్య, బి.ఆంజనేయులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలి.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగస్టు 18 :

గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నవీపేట మండలం యంచ వద్ద పుష్కర ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరైన నేపధ్యంలో కలెక్టర్ మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి అనువైన స్థలం కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో ముఖాముఖి భేటీ అయి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. యంచ గ్రామ శివారులో ఎక్కడ పుష్కర ఘాట్ ఏర్పాటు చేస్తే భక్తులకు అనుకూలంగా ఉంటుంది, అవసరమైన స్థలం అందుబాటులో ఉందా, రవాణా వసతి, ఇతర సదుపాయాలు, భద్రతాపరమైన అంశాలు తదితర వాటి గురించి సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అన్ని అంశాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వం నిర్ధారణ చేసిన ప్రాంతంలోనే పుష్కరఘాట్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిశీలన జరిపిన ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఏమేరకు అందుబాటులో ఉంది, పట్టా భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయన్నది పక్కాగా సర్వే నిర్వహించి వారం రోజుల్లోపు మార్కింగ్ పూర్తి చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించేలా ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా, విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పనులను చేపట్టి, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర దేవాలయం యంచ గ్రామానికి అత్యంత చేరువలో ఉన్నందున గోదావరి పుష్కర పుణ్య స్నానాల కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున లోటుపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట రెవెన్యూ, ఇరిగేషన్, ఎండోమెంట్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.