Career - Local Guide NEWS

ఆంధ్రప్రదేశ్ మెగా DSC మెరిట్ జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మెగా DSC (District Selection Committee) మెరిట్ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితాలో PGT (Post Graduate Teachers), SGT (Secondary Grade Teachers) సహా అనేక కేటగిరీలలో ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా అప్‌డేట్ అవుతున్నాయి.

డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, "అభ్యర్థులు తప్పుడు వార్తలు లేదా అనధికారిక లింకులు నమ్మకూడదు. అధికారిక వెబ్‌సైట్ ద్వారానే పూర్తి వివరాలు తెలుసుకోవాలి. మెరిట్ జాబితాలోకి వచ్చిన అభ్యర్థులు **‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’**లో ఉంటే వారికి ప్రత్యేకంగా వ్యక్తిగత లాగిన్ (Personal Login) ద్వారా కాల్ లెటర్ అందుతుంది" అని స్పష్టంచేశారు.

ఈ DSC ప్రక్రియలో పరీక్ష రాసిన లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గత కొన్ని వారాలుగా మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో అన్న అనుమానం విద్యార్థులలో నెలకొంది. ఇప్పుడు మెరిట్ జాబితా విడుదలతో అనేకమందికి ఊరట లభించింది. ముఖ్యంగా PGT, SGT పోస్టులకు గట్టి పోటీ ఉండటంతో ఎంపికైన వారిలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.

విద్యాశాఖ అధికారులు అభ్యర్థులకు కాల్ లెటర్‌లోని సూచనలను జాగ్రత్తగా పాటించాలని సూచించారు. ఎంపికైన వారు వచ్చే దశలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ వంటి కార్యక్రమాలకు హాజరుకావాలి. ఇదిలా ఉండగా, టాప్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు తమ విజయాన్ని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మెగా DSC ద్వారా రాష్ట్రంలోని వేలాది ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రక్రియలో నూతన ఉత్సాహం రాబోతుంది. విద్యాశాఖ పేర్కొన్న ప్రకారం, తదుపరి అప్‌డేట్స్ అధికారిక వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంటాయి.

➡️ మొత్తం మీద, మెగా DSC మెరిట్ జాబితా విడుదలతో అభ్యర్థులలో కొత్త ఉత్సాహం మొదలవగా, ఎంపికైన వారికి ఇది ఒక విద్యా జీవితంలో మలుపుతిప్పే ఘట్టంగా మారింది.

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో సీహెచ్.భార్గవికి పీహెచ్డీ
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పార్కిన్సన్స్ డ్రగ్ డెలివరీలో సంచలనాత్మక పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని చెక్కిళ్ల భార్గవిని డాక్టరేట్ వరించింది. నాసిక లోపల పంపిణీ కోసం సూక్ష్మవాహకాల మోతాదు సూత్రీకరణ, మూల్యాంకనంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రఘువీర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలకమైన సవాలును డాక్టర్ భార్గవి పరిశోధన పరిష్కరిస్తుందని తెలిపారు. రక్త-మెదడు అవరోధం (బీబీబీ) అంతటా ప్రభావవంతమైన ఔషధ పంపిణీ, డోపమైన్ అగోనిస్ట్ అయిన పిరిబెడిల్ యొక్క ఇంట్రానాసల్ డెలివరీ కోసం నానోస్ట్రక్చర్డ్ లిపిడ్ క్యారియర్లను (ఎన్ఎల్సీ) అభివృద్ధి చేయడం ద్వారా ఆమె అధ్యయనం మెరుగైన ఔషధ ద్రావణీయత, పారగమ్యత, చికిత్సా సామర్థ్యాన్ని ప్రదర్శించిందన్నారు. అధునాతన క్వాలిటీ బై డిజైన్ (క్యూబీడీ) పద్ధతులను ఉపయోగించి ఆప్టిమైజ్ చేసిన నూతన నానోసస్పెన్షన్, అండ్ సాలిడ్ లిపిడ్ నానో పార్టికల్స్ మెరుగైన మ్యూకోఅథెషన్, స్థిరత్వాన్ని చూపించడంతో పాటు సాంప్రదాయ పద్ధతులకు ఆశాజనకమైన నాన్-ఇన్వాసివ్ ప్రత్యామ్నాయాన్ని అందించినట్టు తెలిపారు.
అధిక ఎన్ క్యాప్సులేషన్ సామర్థ్యం, నియంత్రిత విడుదల ద్వారా వర్గీకరించిన ఆమె సూత్రీకరణలు స్థిరమైన రక్తసాంద్రత, తగ్గిన దైహిక దుష్ర్పభావాలతో ఇన్ విట్రో, ఎక్స్ వివో ఫలితాలను కూడా సాధించాయన్నారు. ఇది క్లినికల్ అప్లికేషన్ కు ఉపకరిస్తుందని తెలియజేశారు. డాక్టర్ భార్గవి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మైలురాయి డాక్టర్ భార్గవి అంకితభావం, శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రతిబింబించడ మే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఆరోగ్య సంరక్షణలో పరివర్తన పరిశోధన, ఆవిష్కరణలకు గీతం నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు.

వెలివాడను చేరదీసి.. అక్షరాన్ని అక్కున చేర్చి..
కష్టజీవుల పిల్లలను అక్షరాల వైపు నడిపించిన ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"..

ఆటోలో స్వయంగా కూర్చుని పిల్లలను పాఠశాలకు చేర్చిన ఎమ్మెల్యే శంకర్

సిండికేట్ కాలనీలో దేవగిరి సంచార జాతుల పిల్లలకు భవిష్యత్తు..

స్వయంగా పిల్లలను ఆటోలో తీసుకువెళ్లిన ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"..

ఫరూక్ నగర్ ఎంఈఓ మనోహర్ కృషితో పేద పిల్లలకు విద్య

లోక‌ల్ గైడ్: ఆకలితో అలమటించడం తప్ప అక్షరం నేర్చు కోవడం తెలియని పిల్లలు.. అక్షరాల వైపు తమ పిల్లలను ఎలా నడిపించాలో కూడా తెలియని తల్లిదండ్రులు.. అలాంటి కడుపు పేద జీవులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వయంగా కలుసుకున్నారు.. తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను బడికి చేర్చారు. స్వయంగా ఆటోలో పిల్లలతో పాటు కూర్చుని బడిదాకా ప్రయాణం చేశారు. షాద్ నగర్ పట్టణంలోని సిండికేట్ కాలనీలో సోమవారం కనిపించిన దృశ్యం ఇది. ప్రభుత్వ బడిని ప్రతి ఒక్కరికి చేరువచేసి చదువు చెప్పించాలన్నది అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం. అందులో భాగంగా గతంలో ఎన్నడూ లేనంతగా బడికిరాని పిల్లలను బడికి పంపించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కుగా నిరుపేద పిల్లలను బడికి దగ్గర చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా సిండికేట్ కాలనీలో వెలివాడ పేరిట గుడిసెలు వేసుకుని జీవిస్తున్న నిరుపేద జీవులను ఎమ్మెల్యే స్వయంగా కలుసుకున్నారు. అక్కడ బడికి రాని పిల్లలు, యాచకులుగా, పాత ఇనుప సామాన్లు, సీసాలు ఏరుకునే పిల్లలు ఉన్నారని గుర్తించారు. వారిని బడిలో చేర్పించాలన్న ఆలోచనతో తల్లిదండ్రులతో మాట్లాడి 25 మంది పిల్లలను ఆర్టీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. ఎంఈఓ మనోహర్ కూడా ఈ విషయంలో భాగస్వాములయ్యారు. బడికిరాని పిల్లల విషయంలో ఆయన కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం విశేషం.

చదువే భవిష్యత్తు..

చదివే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తును ఇస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలే ఆణిముత్యాలు గా రూపొందుతారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చదువులకు చాలా ప్రాధాన్యతనిస్తున్నామని, చిన్నపిల్లలు ఇకనుంచి పనులు చేయకుండా బడికి మాత్రమే వెళ్లేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడతామని ఆయన పేర్కొన్నారు. ఏకీకృత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలన్నీ చదువులను బాగు చేయాలనే ఉద్దేశంతోనే చేపడుతున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పటిష్టంగా ఉంటే మధ్యతరగతి వర్గాలు కూడా అక్కడికే వస్తారని, ఫలితంగా వారి మీద పీసులు భారం చాలావరకు తగ్గుతుందని ఎమ్మెల్యే అన్నారు. బడికిరాని పిల్లలు ఎవరు దృష్టిలో ఉన్న తనకు సమాచారం ఇస్తే బడిలో చేర్పిస్తానని ఆయన అన్నారు. నిరుపేద కుటుంబాలలో ఉండే పిల్లలు చదువుకుంటేనే వారికి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బడిబాట కార్యక్రమానికి సహకరించిన ఎంఈఓ మనోహర్ తదితర సిబ్బందిని ఎమ్మెల్యే శంకర్ అభినందించారు..

బడి బయట బాల్యం..
కూలీలుగా చిన్నారులు చదువులకు దూరం

పట్టించుకోని విద్యా కార్మిక అధికారులు

చట్టాలు బలంగా ఉన్న.. అమలు ఎక్కడ..?

మెదక్ లోకల్ గైడ్ ప్రతినిధి

బడి ఈడు పిల్లలు అంటే పాఠశాలకు వెళ్లే పిల్లలు బడిలోనే ఉండాలి. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు.. తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలని, చదువుకోవాలని నిర్బంధ విద్యా హక్కు చట్టం చెబుతోంది. పాఠశాల అనేది పిల్లల సామాజిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన ప్రదేశం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచిత విద్యను అందిస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పుస్తకాలు, యూనిఫాంలు ఇతర అవసరమైన వస్తువులను ఉచితంగా అందిస్తోంది. ప్రభుత్వం ఇలా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బడి బయటనే బాల్యం మగ్గుతోంది. పలక, బలపం పట్టాల్సిన చిట్టి చేతులు పలుగు పార, స్పానర్లు చేత బడుతున్నాయి. అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు కఠినమైన కార్మిక వ్యవస్థలోకి వెళ్తున్నారు. జిల్లాలో ఎంతో మంది చిన్నారులు ఇలా బడి బయటనే మగ్గిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో 'బడి పిలుస్తోంది' అనే పేరు ఉండేది. ఈ కార్యక్రమం ద్వారా సమగ్ర శిక్ష అధికారులు ఈ పిల్లల్ని బడిలో చేర్పించేలా చర్యలు ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ కనిపించడం లేదు.  ఉమ్మడి మెదక్ జిల్లా లో  బడి బయట పిల్లల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో . హోటళ్లలో ఇటుక బట్టీలలో చాలా మంది బడి ఈడు పిల్లలు కనిపిస్తున్నారు. ప్రభుత్వ బడులు నాణ్యమైన విద్య  నాణ్యమైన మధ్యాహ్న భోజనం అన్ని రకాల సౌలతో ప్రభుత్వ పాఠశాలలు  ముందుకు వెళ్తున్న.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను  అందించడం తోపాటు  అన్ని రకాల సౌలతో పాఠశాలలు  ఏర్పాటు ఇస్తున్నాయి . అయినా పేద కుటుంబాలకు  ఇప్పటికీ కూడా రేక్కాడితే   కానీ డొక్కాడని చిన్నారులు  బడి బయటే కూలి  పనులు చేసుకొని  పొట్ట గడుపుకుంటున్నారు.

కూలీలు మారుతున్న చిన్నారులు:

ప్రతి రోజు గంట మోగగానే పుస్తకాలు మోస్తూ బడికి వెళ్లాల్సిన పిల్లలు.. కోడి కూయగానే చేతిలో పని ముట్లు తీసుకుని బయలుదేరుతున్నారు. ఇటుక బట్టీలు, కూలి పనులు, వ్యాపారుల, చెత్తకుండీల వద్దే బాల్యం మొత్తం మగ్గుతోంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చిన్న తనం నుంచే కుటుంబ పోషణ భారాన్ని మోస్తున్నారు. పుస్తకాలు పట్టాల్సిన చేతులతో సుత్తెలు, తట్టలు, భుజా నికి సంచులు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలతో పనులు చేయించవద్దని వారి చిట్టిచేతులు చక్కని రాతలు రాయాలి కాని సుత్తెలు, తట్టలు మోయవద్దని ప్రభుత్వం నిర్బంధ విద్యను చేపడుతోంది. ఎవరైన చిన్నపిల్లలను పనులలో పెట్టుకుంటే శిక్షలు వేస్తామని చెబుతున్నా ఇది ఆగడం లేదు. మరోవైపు కొన్ని చోట్ల చిన్నారులతో భిక్షాటనలు కూడా చేయిస్తున్నట్టు కనిపిస్తోంది. పనికి వెళ్తే.. రోజు రెండు మూడు వందలు కూడా రావు. అది భిక్షాటన చేయిస్తే.. ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందనే ఆలోచనలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వ చర్యలు ఇటీవల కనిపిం చడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకు రావడానికి విద్యాశాఖ, కార్మిక శాఖ, పోలీసులు సంయుక్తంగా పని చేయాల్సి ఉంది. అయితే కరోనా తర్వాత ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. చాలా మంది తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లడంతో పిల్లల చదువు మధ్యలోనే మాన్పించేస్తున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు పనిచేసే చోటే ఉంటూ బడికి దూరమవుతున్నారు. ఇలాంటి వారి కోసం క్షేత్రస్థాయిలో సర్వేలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ అది కూడా ఎక్కడా కనిపించడ  లేదు. జిల్లాలో ఎక్కువగా ఇటుక బట్టీలు, ఇనుప వస్తు వుల తయారీదారులు, మెకానిక్ షెడ్లు, రోడ్డుసైడ్ వ్యా పారం చేసే వారి వద్ద హోటళ్లలో, మరికొందరు గ్రామీ ణప్రాంతాల్లో పంటలు కోయడానికి వెళ్తున్నారు. 2009 లో అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందివ్వాల్సి ఉంది. కానీ లక్ష్యాన్ని చేరుకోవ డంతో ఎస్ఎస్ఎ విఫలమవుతోంది. బాలకార్మిక వ్యవ స్థాను నిర్మూలించి, వీధిబాలలు, వలస పిల్లలను చేరదీసి వారితో అక్షరాలు దిద్దించాలన్నది మాటలకే పరిమిత మవుతోంది. ముఖ్యంగా ఇలా బాల కార్మిక వ్యవస్థ పోవాలంటే ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించాల్సి ఉంది. తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎంతో మంది చిన్నారులు.. బడి బయట భారంగా బతుకీడ్చక తప్పదు.

చదువు అంటే అవకాశం అభివృద్ధికి ఆహ్వానం
(లోకల్ గైడ్ తెలంగాణ)

సమాజంలో ప్రతి మనిషి గౌరవాన్ని  పెంచడానికి మూలాధారం విద్య. అంధకారంలో ఉన్న మనుషుల జీవితాలలో  అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని కలిగిస్తూ ఉన్నత మార్గంలోకి నడిపించేది. ప్రతి మనిషి జీవనశైలిని సరియైన మార్గంలో నడిపించే. విజ్ఞాన మార్గంలో ఉన్న మనుషుల యొక్క లక్ష్యాలను నెరవేరుస్తూ వారిని ఉన్నత మార్గంలోకి తీసుకెళ్తూజీవితాన్ని కొత్త దిశలో ముందుకు సంతోషగా నడిపిస్తుంది.అంతేకాదు సమాజాన్ని శాశ్వతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుంది.విద్య కలిగిన వ్యక్తి అజ్ఞానాన్ని, అసమానతలను, అన్యాయాన్ని ఓడించగలడు.విద్య ద్వారా మనిషి స్వయంగా ఆలోచించగలడు, నిర్ణయాలు తీసుకోగలడు, సమాజంలో మార్పు తేవగలడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటల్లో చెప్పాలంటే విద్య లేకుండా స్వేచ్ఛ స్వప్నమేవికాసానికి విద్య ఎలా తోడ్పడుతుంది? ఆర్థికాభివృద్ధికి దారితీస్తుంది:
విద్య కలిగిన వారు ఉద్యోగ అవకాశాలు పొందగలరు, స్వయం ఉపాధిని సృష్టించగలరు. ఇది వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక స్థిరత్వాన్ని, దేశ స్థాయిలో అభివృద్ధిని తీసుకొస్తుంది. సమాజంలో మార్పువిద్య ఒక వ్యక్తిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో అవగాహన కలుగజేస్తుంది.సాంకేతికత, వైద్యం, శాస్త్రం, కళలు ప్రతి రంగంలో అభివృద్ధికి మూలం విద్యే. ఇది పరిశోధనలకు, ఆవిష్కరణలకు ప్రేరణనిస్తుంది.విద్య జ్ఞానం విజ్ఞానం  మానవత్వం
ఈ రోజుల్లో గుర్తింపు పొందే విద్య మాత్రమే కాకుండా, విలువలతో కూడిన విద్య అవసరం. జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చే దశలో, మానవత్వాన్ని కోల్పోకూడదు. విద్య వల్ల మనం కేవలం ఉద్యోగులు కాకుండా, మంచి మనుషులుగా మారాలి.విద్యను మనం కేవలం పాఠశాలలోనే కాకుండా, జీవితాంతం కొనసాగించాల్సిన ప్రక్రియగా చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చదువులో నిలిపిన ప్రతిదైన జ్ఞానం, ప్రేరణ, చింతన సమాజానికే లాభం చేకూర్చుతుంది.
అందుకే,విద్య వల్లే వికాసం వికాసం వల్లే వెలుగు,వెలుగు వల్లే మార్పు.అయితే, మనందరం కలసి విద్యను విస్తృతంగా పంచుకుంటే, భారతదేశం అభివృద్ధిలో అగ్రగామిగా నిలవడం ఖాయం. మనిషి తలరాతన మార్చి ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లే విధంగా మార్చేది విద్య. పేద ధనిక ఎవరైనా సరే విద్యను పొందుటకు ఎంతో శ్రమిస్తారు. జీవిత లక్ష్యాలను జీవన గమనాన్ని మార్చి దేశానికి సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే గొప్ప శక్తి విద్యకే ఉన్నది. విద్యావంతుడు సమాజంలో ఎక్కడైనా గౌరవించబడతాడు. ధనం కన్నా విద్య ఉన్నవాడే అందరికీ ఆదర్శప్రాయుడుగా. సమాజంలో ఉన్న సమానతలను తొలగిస్తూ  మనుషులందరినీ జ్ఞానవంతులుగా తీర్చిదిద్దే గొప్ప ఆయుధం విద్య.

వ్యాసకర్త
వి.జానకి రాములు గౌడ్
జడ్చర్ల

బీసీ డిగ్రీ గురుకులంలో స్పాట్ అడ్మిషన్స్
లోక‌ల్ గైడ్ రంగారెడ్డి, చేవెళ్ల,

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పురుషుల మరియు మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం డిగ్రీ కొరకు ఈ నెల  జూన్ 30 వరకు ప్రవేశం కొరకు  స్పాట్ కౌన్సిలింగ్, నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మతి కె.గీతాంజలి ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో
బిఏ (అనిమేషన్ & వి,ఎఫ్,ఎక్స్)గ్రూపులో ఖాళీలు ఉన్నాయని ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అన్ని ఒరిజినల్, ధ్రువపత్రాలతో చేవెళ్ల, మోడల్ కాలనీ లోని ఎంజేపీ, డిగ్రీ కళాశాలలో  ఈనెల 30వ తేదీ లోపు హాజరు కాగలరు. అని విద్యార్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు.వివరాలకు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ కె.గీతాంజలి తెలిపారు. 9676200683,6300824461

ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం – 21వ తేదీతో గడువు ముగింపు
ఐటీఐ చదవాలనుకునే విద్యార్థుల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్, వరంగల్‌లలో ఉన్న ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ వంటి వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ కోర్సుల్లో చేరదలిచిన అభ్యర్థులు జూన్ 21వ తేదీలోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ట్రేడులో ప్రవేశం పొందిన విద్యార్థులకు, తాము కోరిన టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తిగల అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

టీఎస్ దోస్త్‌ 2025 ఫేజ్-1 సీట్ల కేటాయింపు మే 29న విడుదల
TS DOST 2025 ఫేజ్-1 సీట్ల కేటాయింపు విడుదల – అభ్యర్థులకు కీలక సూచనలు

హైదరాబాద్‌: తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించబడుతున్న టీఎస్ దోస్త్‌ (TS DOST) 2025 యొక్క మొదటి విడత సీట్ల కేటాయింపు మే 29, 2025న విడుదల కాబోతున్నట్టు అధికారిక సమాచారం. గత సంవత్సరం ప్రకారం ఈ సీట్ల కేటాయింపు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల మధ్య ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశముంది.

సీటు కేటాయింపు అయ్యే అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు సందేశం పంపబడుతుంది. అభ్యర్థులు తక్షణమే అధికారిక వెబ్‌సైట్‌ https://dost.cgg.gov.in ను సందర్శించి, తమ దోస్త్ ఐడి మరియు పాస్‌వర్డ్‌లను ఉపయోగించి లాగిన్ అయి సీటు కేటాయింపు వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

సీటు కేటాయింపు అనంతరం అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేయాలి. దీనివల్ల వారు కేటాయించిన కళాశాలను ముందుగా కన్ఫర్మ్ చేసుకున్నట్లవుతుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ చివరి తేది అనంతరం, సీటు నిల్వ ఉండకపోవచ్చు. కనుక విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అభ్యర్థులు తమ ఎంపికైన కోర్సు, కళాశాల మరియు సీటు స్థితి వివరాలను పూర్తిగా చదివి, ఆ నిర్ణయం మీద ఆధారపడి తదుపరి దశలలో కొనసాగాలని సూచిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం అధికారిక దోస్త్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు.

విద్యార్థుల కోసం ముఖ్య సూచనల సారాంశం:

ఫేజ్-1 సీటు కేటాయింపు: మే 29, 2025

టైమ్ ఫ్రేమ్: ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య

వెబ్‌సైట్: https://dost.cgg.gov.in

అవసరమైన వివరాలు: దోస్త్ ఐడి, పాస్వర్డ్

తదుపరి దశ: Online Self Reporting (ఆన్లైన్ స్వీయ నివేదిక)

హెల్ప్‌లైన్‌: అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో

ఏపీ ఈఏపీసెట్ (AP EAMCET) 2025 ఫలితాలపై తాజా సమాచారం: జూన్ 14 న ఫలితాలు విడుదల అయ్యే అవకాశం
అమరావతి: రాష్ట్ర విద్యా శాఖ నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ (AP EAMCET/EAPCET) 2025 ఫలితాల కోసం వేలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ పరీక్ష ఫలితాలు జూన్ 14, 2025 న విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇది అధికారిక వెబ్‌సైట్‌లో సూచించిన తాత్కాలిక తేదీగా పేర్కొనబడింది.

అయితే, పరీక్షకు సంబంధించిన కీ అభ్యంతరాల తుది తేదీలు త్వరగా ముగియడంతో ఫలితాలు ముందుగానే విడుదల అయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. BiPC స్ట్రీమ్ అభ్యంతరాల తుది తేదీ మే 29 కాగా, MPC స్ట్రీమ్ కోసం మే 30 గా నిర్ణయించారు.

ఈ ఏడాది AP EAMCET 2025 పరీక్షకు మొత్తం 2,80,611 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈమధ్య జరిగిన పరీక్షలకు 2,64,840 మంది అభ్యర్థులు హాజరయ్యారు, ఇది 94 శాతం హాజరు శాతాన్ని సూచిస్తోంది. ప్రత్యేకించి **వ్యవసాయ విభాగం (Agriculture stream)**లో 81,837 మంది దరఖాస్తు చేసుకోగా, 75,460 మంది హాజరయ్యారు, హాజరు శాతం 92%.

అర్హత సాధించని అభ్యర్థులు ఉన్నప్పటికీ, అర్హత పొందిన విద్యార్థుల ర్యాంకులకు ఇది సానుకూల ప్రభావం చూపనుంది. అంటే, అర్హత సాధించిన అభ్యర్థులకు comparatively మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది.

ఈసారి పరీక్షా నిర్వహణ సజావుగా సాగిందని విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. ఇక ఫలితాల తర్వాత సీట్ల కేటాయింపు (Counselling) ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను సంబంధిత అధికారుల అనుమతులు వచ్చాక ప్రకటించనున్నారు.

విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల విడుదల తేదీకి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది.

ముఖ్యమైన తేదీలు:

BiPC కీ అభ్యంతరాల చివరి తేదీ: మే 29, 2025

MPC కీ అభ్యంతరాల చివరి తేదీ: మే 30, 2025

AP EAMCET ఫలితాల తాత్కాలిక విడుదల తేదీ: జూన్ 14, 2025

విద్యార్థులు ఈ వ్యవధిలో అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శిస్తూ తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ.. జస్ట్‌ మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు!
లోక‌ల్ గైడ్ :
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సేవలు ఇప్పుడు మరింత సులభతరంగా మారాయి. ఈపీఎఫ్‌ ఖాతాదారులు తమ ఖాతా సమాచారం తెలుసుకోవాలంటే ఇకపై కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు, గానీ వెబ్‌సైట్‌ వాడాల్సిన పని కూడా లేదు. మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం లేదా ఎస్‌ఎంఎస్‌ పంపడం ద్వారా ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సేవలు పూర్తిగా ఉచితం, వాడడం చాలా సులభం, అంతేకాదు స్మార్ట్‌ఫోన్‌ లేదా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండానే వీటిని ఉపయోగించవచ్చు.ఈ సేవలు పొందాలంటే, ఖాతాదారి యూఏఎన్‌ (UAN) క్రియాశీలంగా ఉండాలి. అలాగే యూఏఎన్‌కు బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ లేదా పాన్‌ నంబర్‌ లింక్‌ అయి ఉండాలి. అంతేకాదు, మొబైల్‌ నంబరు కూడా EPFO పోర్టల్‌లో నమోదు అయి ఉండాలి.

మిస్డ్‌ కాల్‌ సేవ:
9966044425 నంబరుకు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరు నుండి మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలి. రెండు రింగ్‌లు అయిన వెంటనే కాల్‌ కట్‌ అవుతుంది. వెంటనే పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌, ప్రస్తుత బ్యాలన్స్‌ వివరాలు ఉన్న టెక్స్ట్‌ మెసేజ్‌ వస్తుంది. ఈ సేవలు రోజు 24 గంటలు, వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటాయి.

ఎస్‌ఎంఎస్‌ సేవ:
రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరు నుంచి EPFOHO UAN అని టైప్‌ చేసి 7738299899 నంబరుకు పంపించాలి. మీ ఖాతా కంట్రిబ్యూషన్‌, బ్యాలన్స్‌ సమాచారం మెసేజ్‌గా వస్తుంది.

ప్రాంతీయ భాషల్లో సమాచారం కావాలంటే:
యూఏఎన్‌ తరువాత ఆ భాషకు సంబంధించిన మూడు అక్షరాల కోడ్‌ను టైప్‌ చేయాలి. ఉదాహరణకి, తెలుగులో సమాచారం కావాలంటే EPFOHO UAN TEL అని టైప్‌ చేసి 7738299899 నంబరుకు పంపించాలి.

17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు
లోక‌ల్ గైడ్ :
జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. సెషన్‌-2 పేపర్‌-1(బీఈ, బీటెక్‌) పరీక్షలు మంగళవారంతో ముగియగా, పేపర్‌-2(బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) పరీక్ష బుధవారంతో ముగిసింది.మొదటి సెషన్‌ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో సెషన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. అదే రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుంది. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుండగా, 2.5లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు.

నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
లోక‌ల్ గైడ్:

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్‌ 7: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నాంపల్లి ప్రాంగణంలో గల పుస్తక విక్రయ కేంద్రంలో ఈ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది తెరిచి ఉంటుందని వెల్లడించారు.ఈ పుస్తక ప్రదర్శలో ప్రతి పుస్తకంపై 60 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ప్రాచీన గ్రంథాలు, సాహిత్యం, నిఘంటువులు, సంగీత, నృత్య గ్రంథాలు, భారత, భాగవతాలు, ప్రబంధాలు, పురాణాలు, పంచకావ్యాలు, ఇతిహాసాలు, చరిత్ర గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు తగ్గింపు ధరలలో విక్రయానికి సిద్ధంగా ఉంటాయని, సాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, భాషా ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.