National - Local Guide NEWS

తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం
చెన్నై, మార్చి 29: తమిళనాడులో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ డీఎంకే (DMK) ఘన విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 234 స్థానాలున్న స్థానిక సంస్థల్లో డీఎంకే భారీ మెజారిటీతో ముందంజలో నిలిచి, స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.

అందిన సమాచారం ప్రకారం, డీఎంకే సుమారు 164 స్థానాల్లో విజయఢంకా మోగించింది. దీంతో పార్టీ నాయకత్వం మరియు కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ముఖ్యమంత్రి M. K. Stalin ఈ విజయాన్ని ప్రజల విశ్వాసానికి ప్రతీకగా అభివర్ణిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి మరింత కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.

ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయి. ముఖ్యంగా, సుమారు 60 స్థానాల్లో మాత్రమే ఇతర పార్టీలు విజయం సాధించగలిగాయి. దీనితో డీఎంకే ఆధిపత్యం మరింత బలపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో పార్టీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తూ, నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విజయంతో తమిళనాడులో డీఎంకే ప్రభావం మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫలితాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

యాక్సిస్ బ్యాంక్ తన వార్షిక కళ, చేతిపనులు మరియు సాహిత్య పోటీ అయిన స్లాష్ 2025 ను నిర్వహించడానికి
లోకల్ గైడ్ గుంటూరు
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, దేశవ్యాప్తంగా 995 కి పైగా పాఠశాలల నుండి విద్యార్థులను ఆకర్షించి, వార్షిక కళ, చేతిపనులు మరియు సాహిత్య పోటీ యొక్క 13 వ ఎడిషన్ అయిన స్ప్లాష్ 2025 ను విజయవంతంగా నిర్వహించింది. యాక్సిస్ బ్యాంక్ బ్రాండ్ తత్వశాస్త్రం - దిల్ సే ఓపెన్ నుండి ప్రేరణ పొందిన ఈ సంవత్సరం ఎడిషన్‌లో 'డ్రీమ్స్' అనే థీమ్‌పై 2.66 లక్షలకు పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు, ఈ యువ మనస్సులు వారి ఊహ మరియు సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రోత్సహించారు.దక్షిణ ప్రాంతంలో, బ్యాంక్ హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు, బాగల్‌కోట్, విశాఖపట్నం, కడప మరియు నెల్లూరు వంటి 308 పాఠశాలల్లో ఈ పోటీని నిర్వహించింది. 1.01 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొని, 7-10 సంవత్సరాల వయస్సు వారికి 'నా కలల జీవితంలో ఒక రోజు' మరియు 11-14 సంవత్సరాల వయస్సు వారికి 'నేను కలలు కనే భవిష్యత్తు' అనే రెండు ఉప-అంశాల కింద ఎంట్రీలు సమర్పించారు.ఈ ఇతివృత్తానికి అనుగుణంగా, యాక్సిస్ బ్యాంక్ 'అల్ డ్రీమ్ జనరేటర్'ను కూడా ప్రారంభించింది, ఇది పిల్లలు తమ కలలను సజీవంగా మార్చుకోవడానికి సహాయపడే ఇంటరాక్టివ్ డిజిటల్ సాధనం. ఎగిరే కార్లు మరియు మాట్లాడే జంతువుల నుండి చంద్రునిపై నగరాలను నిర్మించడం వరకు, పిల్లలు తమ కలలలోకి ప్రవేశించి, తమకు ఇష్టమైన మాధ్యమం-కళ, చేతిపనులు లేదా సాహిత్యాన్ని ఎంచుకోవచ్చు-చూడటానికి. వారి ఊహకు ప్రాణం పోసింది.ఈ పోటీ ఆరుగురు జాతీయ విజేతలు మరియు ఆరుగురు జాతీయ రన్నరప్‌లతో ముగుస్తుంది, వారికి వరుసగా ₹1 లక్ష మరియు ₹50,000 బహుమతిగా ఇవ్వబడుతుంది. దుబాయ్‌లోని తాష్కీల్‌లో జరిగే ప్రత్యేక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశం కూడా వారికి లభిస్తుంది. ఈ విజేతల కళాకృతులనుబెంగళూరులోని మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ ఫోటోగ్రఫీ ( మ్యాప్)లో ప్రదర్శిస్తారు. అదనంగా, టాప్ 400 అర్హత సాధించిన వారికి ఇక్సిగో మరియు అమెరికన్ టూరిస్టర్ వంటి భాగస్వామి బ్రాండ్‌ల నుండి ఉత్తేజకరమైన గూడీస్ మరియు వోచర్‌లు అందుతాయి.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆర్‌పి‌ఐ (అథవాలే) కార్యక్రమాలు
*లోకల్ గైడ్:* 24/11/2025
హైదరాబాద్‌: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్ర కమిటీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, ఈనాడు కార్యాలయం ఎదుట, హైదరాబాద్‌లో జరుగనుంది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించగా, అనంతరం 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా, 2015లో భారత ప్రభుత్వం నవంబర్ 26నను అధికారికంగా “రాజ్యాంగ దినోత్సవం”గా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతం దిశగా భారీ ఎత్తున నూతన నాయకుల చేరిక, సభ్యత్వ నమోదు కార్యక్రమం, రానున్న గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్ర కమిటీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా హాజరవాలని పార్టీ పిలుపునిచ్చింది. మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం ఇచ్చింది. కార్యక్రమం అనంతరం భోజన ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు.

అలాగే, ఇదే రోజున ఉదయం 12 గంటలకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)  మీటింగ్  సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరగనుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివ నాగేశ్వర్‌రావు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజు కావడంతో, ఈ సందర్భంగా  మీటింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఈ సమావేశంలో ఇటీవల పార్టీలో చేరిన ఫణి భూషణ్‌ను సన్మానించడం, జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించడం, డిసెంబర్ 1న ఢిల్లీలో జరగనున్న నేషనల్  మీటింగ్ ఏర్పాట్లు,  మరింత పటిష్ఠం చేయడానికి అవసరమైన చర్యలపై నాయకుల అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నట్టు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు ఉదయం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు హాజరుకావాలని పేరం శివ నాగేశ్వర్‌రావు ఆహ్వానించారు.

స్క్రీన్ షేర్‌తో ఖాతాలో డబ్బులు గల్లంతు – సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి మీ అకౌంట్ సమస్యలు ఉన్నాయని చెప్పే వ్యక్తులపై జాగ్రత్త. వారు వెంకట అప్డేట్ చేయాలని కోరుతూ OTP అడుగుతారు. ఇలా చెబితే అది బ్యాంక్ నుంచి వచ్చిందని నమ్మకండి. వారు మీరు వీడియో కాల్ చేయాలని చెబుతారు. వీడియో కాల్ లో వారు మీ ఫోన్ స్క్రీన్ షేర్ చేయమని కోరుతారు. స్క్రీన్ షేర్ చేసేందుకు ఒప్పుకుంటే వారు మీ మొబైల్ లోని బ్యాంకింగ్ యాప్‌లకు యాక్సెస్ పొందుతారు.

మీ స్క్రీన్ షేర్ అయిన తర్వాత, వారు మీ అకౌంట్ డీటెయిల్స్, పాస్‌వర్డ్‌లను చూసి అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తారు. ఇది సైబర్ నేరగాళ్ల కొత్త మోసం విధానం. ఈ విధంగా స్క్రీన్ షేర్ ద్వారా వారు డైరెక్ట్‌గా మీ బ్యాంక్ యాప్‌ను యాక్సెస్ చేసి, మోసానికి పాల్పడతారు. ఫోన్‌లో దేశం మొత్తం నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్నారు.

ఈ మోసాన్ని మించిన ప్రమాదం మరొకటి లేదు. ఇది కొత్త రకం మోసం కావడంతో ప్రజలు తేలిగ్గా నమ్ముతున్నారు. స్క్రీన్ షేర్ చేసిన తర్వాత మీరు చూసేంతలోనే వారు మీ ఖాతాలో డబ్బు తీసేస్తారు. ఇది మీ అప్రమత్తతను పరీక్షించే సమయంలో భాగం. బ్యాంకులు ఈ తరహా డేటాను ఎప్పుడూ ఫోన్ ద్వారా అడగవు.

ఈ వార్త చైతన్యం కలిగించే అంశం: స్క్రీన్ షేర్ చేయడం ద్వారా మీ ఫోన్ పూర్వాధికారం నేరగాళ్లకు దక్కుతుంది. వారు మీ పాస్‌వర్డ్, ఓటిపి అన్నీ చూడగలుగుతారు.

ఈ మోసాల నుంచి రక్షణకు కొన్ని జాగ్రత్తలు:

ఎప్పుడూ స్క్రీన్ షేర్ చేయొద్దు.

బ్యాంక్ పేరుతో వచ్చిన కాల్స్‌ను నమ్మవద్దు.

డౌట్ఫుల్ కాల్స్ ఉంటే బ్యాంక్ అధికారిక నంబర్లకు ఫోన్ చేయండి.

ఎప్పుడూ ఫోన్‌లో బ్యాంకింగ్ వివరాలు చెప్పకండి.

"జియో కొత్త వ్యూహం: రూ. 299 ప్లాన్‌తో రోజుకు 1.5జీబీ డేటా – వినియోగదారుల సంఖ్యలో భారీ వృద్ధి"
రిలైయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మార్పులు చేస్తూ ఇటీవల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రెండు చౌక ప్లాన్‌లను కంపెనీ తమ జాబితా నుంచి తొలగించింది. దీంతో, ప్రస్తుతం జియోలో రోజువారీ డేటా అందించే ప్లాన్‌లలో అత్యంత చౌకైన ప్లాన్‌గా రూ. 299 ప్యాక్ నిలిచింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది.

ఇది చూస్తే, జియో తన ధరలు పెంచినప్పటికీ, వినియోగదారులకు మరింత డేటా ప్రయోజనం అందిస్తూ ఆత్మవిశ్వాసాన్ని చూపుతోంది. గతంలో రూ. 209 వంటి చిన్న ప్లాన్‌లలో రోజుకు 1జీబీ డేటా మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు కనీస ప్లాన్ అయిన రూ. 299 ప్లాన్‌‍లోనే 1.5జీబీ డేటా అందించడం గమనార్హం. ఇది ముఖ్యంగా యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవలను తరచూ వాడే వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా మారవచ్చు.

జియో ధరలు పెంచినప్పటికీ, వినియోగదారుల సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపించడం విశేషం. ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) తాజా గణాంకాల ప్రకారం, 2025 జూన్‌లో జియో 19 లక్షల కొత్త కస్టమర్లను నమోదు చేసుకుంది. ఇది జియో ప్రధాన పోటీదారు అయిన ఎయిర్‌టెల్ సంపాదించిన కొత్త వినియోగదారుల కంటే రెట్టింపు. ఇది జియో బ్రాండ్‌పై ఉన్న ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.

ఇక మరోవైపు, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు తమ మార్కెట్‌షేర్‌ను కోల్పోతున్నాయి. ధరల పెంపుతో పాటు, డేటా లిమిట్లు మరియు నెట్‌వర్క్ ఖచ్చితత్వం వంటి అంశాల్లో వీటి సేవలు పోటీదారులకు అనుకూలంగా లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు.

మొత్తంగా చూస్తే, జియో తన వ్యూహాత్మక మార్పులతో వినియోగదారులకు మరింత విలువను అందించడమే కాకుండా, మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తోంది. భవిష్యత్తులో జియో మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్‌లు తీసుకువచ్చే అవకాశముంది.

అంతర్జాతీయ స్వేచ్ఛాలో భారతదేశం స్థానం151.
లోకల్ గైడ్  1947లో మనం రాజకీయ స్వేచ్ఛను పొందాము. కానీ నేటికీ 79 ఏళ్ల తరువాత కూడా మనం నిజమైన స్వేచ్ఛలో ముందంజ వేయలేకపోతున్నాం. పలు అంతర్జాతీయ సూచికల్లో మన స్థానం 151లో దక్కింది. ఇలా వెనుకబడిపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

*స్వేచ్ఛ సమానత్వంలో వెనుకబడిపోవడానికి ప్రధాన కారణాలు*

ప్రజాస్వామ్య భవనాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలు.శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా. మీడియా కేవలం స్తంభం కాదు అది ప్రజాస్వామ్య దృష్టి, శ్రవణం,ప్రజల గుండె చప్పుడు. ప్రజల కష్టసుఖాలను, ప్రభుత్వ తప్పిదాలను, సమాజంలోని దాగిన సత్యాలను వెలుగులోకి తెస్తుంది. నిజం చెప్పడమే దాని ధర్మం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.ప్రజాస్వామ్యంపై నీచపు దాడులు.2014 నుండి 2025 వరకు, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో 56 జర్నలిస్టులు హత్యకు గురయ్యారు, 300 మందిపై తప్పుడు కేసులు నమోదయ్యాయి. ఉదాహరణ...2023లో ఒడిశాకు చెందిన జర్నలిస్ట్ అభిజిత్ సాహు ఎన్ఐఎ కేసులో అరెస్టయ్యారు. ఇవి కేవలం మీడియాపై దాడులు కాదు, ప్రజాస్వామ్య హృదయంపై గుచ్చే బాకులు.నిజం వెల్లడించే జర్నలిస్టులపై తప్పుడు కేసులు.విమర్శనాత్మక పత్రికలపై ఆర్థిక ఆంక్షలు.చట్టాల దుర్వినియోగంతో స్వేచ్ఛను గొంతు నులిమే కుట్రలు.అధికారికంగా కొన్ని మాత్రమే ఉన్నాయి అనాధికారకంగా మరెన్నో ఉన్నాయి.మీడియా స్వేచ్ఛ క్షీణిస్తే, ప్రజాస్వామ్యం కాగితపు పుష్పంగా మిగిలిపోతుంది.ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడడం కేవలం ఒక నైతిక కర్తవ్యం మాత్రమే కాదు, అది దేశ భవిష్యత్తుకు అవసరమైన రక్షణ కవచం.మీడియా అణచివేత, జర్నలిస్టులపై బెదిరింపులు, కేసులు, ఆర్థిక ఒత్తిళ్లు వంటివి ప్రజాస్వామ్యాన్ని లోపల నుండి కుల్ల కొడుతున్నాయి.

*మీడియా స్వేచ్ఛకు పటిష్టమైన చట్టాలు తీసుకురావాలి.*

నార్వే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో ఎప్పుడూ మొదటి స్థానంలో లేదా టాప్ 3లో ఉంటుంది. ప్రభుత్వం మీడియాపై ఒత్తిడి చేయకుండా పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇస్తుంది.మీడియాకు పటిష్టమైన చట్టపరమైన రక్షణతో పాటు, జర్నలిస్టుల గోప్యతా హక్కులు బలంగా అమలు చేస్తుంది.మీడియా స్వతంత్రత, పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ప్రసిద్ధి చెందింది. ఇలాంటి చట్టాలు భారత దేశంలో తీసుకువచ్చినప్పుడే స్వేచ్ఛలో ముందంజలో ఉంటుంది.

*రాజకీయాల్లో స్వార్థం... ప్రజాస్వామ్యానికి పెరుగుతున్న ముప్పు*

ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలన. కానీ నేటి రాజకీయాలు ఈ ఆదర్శాన్ని కాగితంపైనే ఖైదీ చేస్తున్నాయి. అధికార దాహం, వ్యక్తిగత లాభాలు, పార్టీ స్వప్రయోజనాలు రాజకీయ నీతిని కబళిస్తున్నాయి.ఎన్నికల సమయంలో "జనసేవ" ముసుగులో నాయకులు గొప్ప హామీలు గుప్పిస్తారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీలు మాయమవుతాయి. ఐదు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ 50% ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుంటారు. ఇది పరిపాటిగా మారిపోయింది. హామీలు ఇచ్చి ఎందుకు నెరవేర్చలేదని ప్రజలు ప్రశ్నిస్తే.... గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింది. గత ప్రభుత్వం అవినీతి అక్రమాల పాల్పడింది . అని కల్లబొళ్ళు మాటలతో కాలం వెల్లదీస్తూ కాలం గడుపుతుంటారు. హామీలు ఓటు బ్యాంకు సాధనాలుగా మారాయి తప్ప సేవ సంకల్పాలుగా మారడం లేదు.

*ప్రజాధనం రాజకీయ స్వార్థానికి బలి*

అభివృద్ధి పేరిట సేకరించిన నిధులు పార్టీ ప్రచారం, నాయకుల వ్యక్తిగత ఇమేజ్ నిర్మాణానికి దుర్వినియోగమవుతున్నాయి. పేదల కోసం కేటాయించిన పథకాలు కూడా రాజకీయ లాభాలకు సాధనాలుగా మారుతున్నాయి.అసెంబ్లీలు, పార్లమెంట్లు ప్రజా సమస్యల చర్చా వేదికలుగా ఉండాలి.కానీ అవి నేడు రాజకీయ ఆరోపణలు, దాడుల రణక్షేత్రాలుగా మారాయి.

*స్వార్థం నుంచి సేవ వైపు మారాలి.*

ఎన్నికల హామీలు అమలు చేయకపోతే చట్టపరమైన చర్యల నిబంధనలు తప్పనిసరి.ప్రజలకు నేరుగా సమాధానమిచ్చే "పబ్లిక్ అకౌంటబిలిటీ సిస్టమ్" అమలు చేయాలి.మీడియా, సివిల్ సొసైటీ సంస్థల నిరంతర పర్యవేక్షణ చేయాలి.ఇలా చేస్తేనే రాజకీయాలు స్వార్థం నుంచి సేవాస్ఫూర్తి వైపు మళ్లీ జనసమస్యల పరిష్కారానికి అంకితమవుతాయి.

*న్యాయం ... నిదాన సుతి*

భారతదేశ న్యాయవ్యవస్థలో కేసుల పెండింగ్ సంఖ్య భయానక స్థాయికి చేరింది. 2025 నాటికి, సుప్రీంకోర్ట్, హైకోర్టులు, జిల్లా మరియు ఉపన్యాయస్థాయి కోర్టులు (విద్యుతీకృత కోర్టులు సహా) మొత్తం సుమారుగా 5.3 కోట్లు (53 మిలియన్ల) కేసులు పెండింగ్‌లో ఉన్నాయి .ఈ మొత్తం నుండి 47 మిలియన్ల (+85%) కేసులు జిల్లా కోర్టుల్లో పెండింగ్‌గా ఉన్నాయి .మరికొన్ని 60 లక్షల కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.ఇది కేవలం గణాంకం మాత్రమే కాదు ప్రతి కేసు వెనుక ఒక కుటుంబం, ఒక వ్యక్తి జీవితకాల ఆశలు, భవిష్యత్ బంధించబడి ఉన్నాయి.ఉదాహరణకు, అయోధ్య వివాదం తీర్పు రావడానికి 134 సంవత్సరాలు పట్టింది.ఇలాంటి ఆలస్యం, ప్రజల న్యాయంపై నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తికి న్యాయం జరగాలంటే దాదాపు ఐదు నుండి 15 సంవత్సరాల సమయం పడుతుంది.

*స్వేచ్ఛా సూచికలో ముందుండాలంటే… కేసుల తీర్పు వేగం తప్పనిసరి.*

భారతదేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విస్తరించాలి. అత్యవసర, ప్రజాస్వామ్యపరమైన ప్రాధాన్య కేసులను వేగంగా పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.కేసు ఫైల్ నుండి తీర్పు వరకు అన్ని ప్రక్రియలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి. దీని వల్ల కాలయాపన, అవినీతి తగ్గుతుంది.డిజిటలైజేషన్ & ఈ-కోర్టులు పెంచాల్సిన అవసరం ఉంది.

*ఆర్టిఐ ఖాళీ భర్తీలు పూర్తి చేయాలి.*

సమాచార హక్కు చట్టం (RTI Act, 2005) భారతదేశంలో పారదర్శక పాలన మరియు బాధ్యతాయుతమైన ప్రభుత్వ వ్యవస్థకు కీలకమైన సాధనంగా పనిచేస్తుంది. ఈ చట్టం పౌరులకు ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు మరియు పనితీరును పరిశీలించే అవకాశాన్ని అందిస్తూ, వారి హక్కులను రక్షించుకునేందుకు శక్తినిస్తుంది. అయితే, ఈ చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే, కేంద్ర మరియు రాష్ట్ర సమాచార కమిషన్లలో ఖాళీగా ఉన్న పదవులను వెంటనే భర్తీ చేయడం అత్యవసరం.ప్రస్తుతం, సమాచార హక్కు చట్టం ప్రకారం, పౌరులు అడిగిన సమాచారాన్ని 30 రోజులలోపు అందించాలని నిర్దేశిస్తుంది. కొన్ని సందర్భాల్లో, అత్యవసర పరిస్థితుల్లో 48 గంటలలో అందించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా సమాచార కమిషన్లలో ఖాళీలు, అవసరమైన సిబ్బంది కొరత, మరియు ఆలస్యమయ్యే ప్రక్రియల కారణంగా, చట్టంలో పేర్కొన్న గడువు మరియు వాస్తవ అమలు మధ్య పెద్ద అంతరం కనిపిస్తోంది. ఉదాహరణకు, కొన్ని రాష్ట్రాల్లో సమాచార కమిషన్లలో దాదాపు 20-30% పదవులు ఖాళీగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఖాళీల కారణంగా, RTI దరఖాస్తులకు సమాధానాలు ఆలస్యమవుతున్నాయి, దీనివల్ల పౌరులు తమ హక్కులను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నారు.ఈ సమస్యను పరిష్కరించడానికి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి. ముందుగా, సమాచార కమిషన్లలో ఖాళీగా ఉన్న పదవులను పారదర్శకమైన మరియు వేగవంతమైన నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలి. రెండవదిగా, సమాచార కమిషన్లకు తగిన ఆర్థిక మరియు మానవ వనరులను కేటాయించడం ద్వారా వాటి సామర్థ్యాన్ని పెంచాలి. అదనంగా, RTI దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు మరియు ట్రాక్ చేసేందుకు సులభమైన డిజిటల్ వేదికలను బలోపేతం చేయడం ద్వారా ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.చివరగా, పౌరులలో RTI చట్టం గురించి మరింత అవగాహన కల్పించడం కూడా ముఖ్యం. సమాచార హక్కును సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా పౌరులు ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశీలించి, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయవచ్చు. ఈ చట్టం యొక్క నిజమైన సామర్థ్యాన్ని సాకారం చేయడానికి, ప్రభుత్వం మరియు పౌర సమాజం కలిసి పనిచేయడం ద్వారా దాని అమలులో ఉన్న లోపాలను సరిదిద్దడం అవసరం.

*రైట్ టు రికల్ వంటి చట్టాలు చేయాలి.*

"రైట్ టు రీకాల్" అనేది ప్రజలు ఎన్నికల్లో ఎంచుకున్న ప్రతినిధి తన బాధ్యతలు, హామీలు నెరవేర్చకపోతే, పదవీ కాలం పూర్తయ్యే లోపు అతన్ని పదవి నుంచి తప్పించే హక్కు.ఈ ప్రక్రియలో సాధారణంగా ఒక నిర్దిష్ట శాతం ఓటర్లు సంతకాలు చేస్తే, రీకాల్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇలాంటి చట్టాలు భారతదేశంలో అమలు చేస్తే భారతదేశంలో అవినీతి తగ్గుతుంది. పేదరికం తగ్గుతుంది. దేశ పురోగతి అద్భుతంగా ఉంటుంది. టాప్ టెన్ లో భారతదేశం ఉంటుందని పలువురు విశ్లేషకులు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఎర్రకోటపై చరిత్ర సృష్టించిన మోదీ – 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం
లోకల్ గైడ్ న్యూఢిల్లీ:

దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుండి 103 నిమిషాల పాటు జాతీయ ప్రసంగం చేశారు. ఇది ఇప్పటివరకు ఏ భారత ప్రధాని చేసిన అతి పొడవైన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంగా రికార్డైంది. అలాగే, ఇది ఆయన 12వ వరుస ప్రసంగం కావడం ద్వారా ఇందిరా గాంధీ రికార్డును అధిగమించారు.

ఆపరేషన్ సిందూర్ విజయకేతనం

మోదీ తన ప్రసంగంలో తాజాగా జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ప్రస్తావిస్తూ భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ప్రతీకార దాడిలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఈ ఆపరేషన్ ద్వారా శత్రువుకు భారీ నష్టం కలిగించామని చెప్పారు.

పాకిస్తాన్‌కు కఠిన హెచ్చరిక

పాకిస్తాన్ నుండి వస్తున్న అణు బెదిరింపులను భారత్ సహించదని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు మరియు వారికి మద్దతు ఇచ్చే వారిలో తేడా ఉండదని హెచ్చరించారు. “రక్తం మరియు నీరు ఒకేసారి ప్రవహించవు” అంటూ ఇండస్ జల ఒప్పందాన్ని పునర్విమర్శించనున్నట్లు తెలిపారు. దేశ జలహక్కులను రక్షించడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు.

కొత్త సంస్కరణలు – పథకాలు

ఆగమి దీపావళి నాటికి నెక్స్ట్ జనరేషన్ GST సంస్కరణలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. ‘మిషన్ సుదర్శన చక్ర’ పేరుతో కొత్త రక్షణ వ్యవస్థను, అలాగే 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ‘పీఎం విక్సిత్ భారత్ రొజ్గార్ యోజన’ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

స్వావలంబన – విక్సిత భారత్ లక్ష్యం

2047 నాటికి విక్సిత భారత్ సాధించాలంటే ‘ఆత్మనిర్భర్ భారత్’ అనేది బలమైన పునాది కావాలని మోదీ అన్నారు. స్వదేశీ తయారీపై దృష్టి పెట్టి, ‘మేడ్ ఇన్ ఇండియా’ జెట్ ఇంజిన్లు ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు.

ఇతర అంశాలు

మోదీ ప్రసంగంలో భారత అణు శక్తి రంగ ప్రగతి, గగనయాన్ మిషన్ విజయం, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా నివాళులు, అలాగే దేశ జనాభా మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు.

దేశ భవిష్యత్తు కోసం ఆవిష్కరణలు, సైనిక బలం, ఆర్థిక సంస్కరణలు, ప్రజల ఏకత ముఖ్యమని ప్రధానమంత్రి సందేశమిచ్చారు. ఆయన ప్రసంగం దే

శవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త
లోకల్ గైడ్:మన సమాజంలో కొన్ని ఘటనలు మనసును కుదిపేస్తాయి. అలాంటి ఒక విషాదకరమైన సంఘటన గత సంవత్సరం చోటుచేసుకుంది. వాగ్ బక్రి టీ పౌడర్ యజమాని మరియు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన పరాగ్ దేశాయ్, సుమారు ₹2,000 కోట్ల విలువైన ఆస్తుల అధిపతి, తన వ్యాపారాన్ని 60 కంటే ఎక్కువ దేశాలలో విస్తరింపజేసిన విజయవంతమైన పారిశ్రామికవేత్త. అయితే, అంతటి గొప్ప విజయాలు సాధించిన ఈ వ్యక్తి ఒక దురదృష్టకరమైన ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోవడం అందరినీ కలచివేసింది.

ఒక సాధారణ ఉదయం, పరాగ్ దేశాయ్ నడకకు వెళ్లారు. అనేకమందికి ఉదయనడక ఆరోగ్యానికి మేలు చేసే ఒక అలవాటు. కానీ ఆ రోజు ఆయన జీవితాన్ని మార్చేసింది. నడుస్తుండగా, కొన్ని వీధికుక్కలు ఆకస్మికంగా ఆయనను వెంబడించాయి. కుక్కల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆయన జారి నేలపై పడ్డారు. తల బలంగా తాకడంతో మెదడులో రక్తస్రావం (Brain Hemorrhage) ఏర్పడింది.

ఆ సమయంలో, ఆయన అపస్మారక స్థితిలో ఉండగా, సమాచారం ప్రకారం కొన్ని కుక్కలు ఆయనను ఇంకా కరిచాయి. వెంటనే స్థానికులు స్పందించి, ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మొదట శాలి హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అందించబడింది. అనంతరం, పరిస్థితి విషమించడంతో జైదస్ హాస్పిటల్‌కు తరలించి శస్త్రచికిత్స చేశారు.

అయితే, తల గాయం తీవ్రత కారణంగా ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశారు. ఏడు రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడిన అనంతరం, 49 ఏళ్ల వయసులో ఈ యశస్వి పారిశ్రామికవేత్త ప్రాణాలు కోల్పోయారు. భార్య విదిషా దేశాయ్, కుమార్తె పరిషా దేశాయ్ ఆయనకు మిగిలిన కుటుంబ సభ్యులు.

ఈ సంఘటన మన సమాజంలో రెండు ప్రధాన సమస్యలను గుర్తు చేస్తుంది:

1. వీధికుక్కల సమస్య – నగరాల్లో పెరుగుతున్న వీధికుక్కల సంఖ్య, వాటి ప్రవర్తనలోని అనిశ్చితి, మరియు మనుషులపై దాడులు ఒక ఆందోళనకర అంశం.

2. ప్రజా భద్రత లోపం – నడక మార్గాలు, వీధులు సురక్షితంగా ఉండకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

వీధికుక్కల సమస్యను కరుణతో కానీ క్రమపద్ధతిగా పరిష్కరించాలి. Animal Birth Control (ABC) కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, వీధికుక్కలకు టీకాలు ఇవ్వడం, షెల్టర్లలో ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలి. పౌరులుగా మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి – ముఖ్యంగా ఒంటరిగా నడుస్తున్నప్పుడు పరిసరాలను గమనించడం, కుక్కల సమూహాలను దూరంగా ఉంచుకోవడం, ప్రమాదం అనిపిస్తే నెమ్మదిగా వెనక్కి తగ్గడం.

పరాగ్ దేశాయ్ మరణం ఒక వ్యక్తి మాత్రమే కోల్పోవడమే కాదు, ఒక కుటుంబానికి, ఒక సంస్థకు, మరియు సమాజానికి జరిగిన పెద్ద నష్టం. ఆయన వాగ్ బక్రి టీ గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన వ్యక్తి. వ్యాపారంలోనూ, సామాజిక సేవలోనూ, ఆయన చేసిన కృషి గుర్తుండిపోతుంది.

ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. ప్రమాదాలు ఎప్పుడైనా, ఎవరికైనా సంభవించవచ్చు. అప్రమత్తంగా ఉండటం, సురక్షిత మార్గాలను ఎంచుకోవడం, మరియు సమాజంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం మనందరి బాధ్యత.

దయచేసి ఈ సంఘటనను ఇతరులతో పంచుకోండి. అవగాహన పెంచండి. వీధికుక్కల సమస్యను పరిష్కరించడంలో, మరియు రహదారులను సురక్షితంగా మార్చడంలో భాగస్వాములు అవ్వండి. ఒక చిన్న జాగ్రత్త,

ఒక ప్రాణాన్ని కాపాడగలదు.

2024 ఎన్నికల్లో ఓటరు మోసాలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు – ఐదు ప్రధాన రకాల మోసాల జాబితా
లోకల్ గైడ్ బెంగళూరు ఆగస్టు 6, 2025:

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు మోసాలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. బెంగళూరు సెంట్రల్ లోకసభ పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంపై తన బృందం నిర్వహించిన దర్యాప్తు నివేదికను ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో వెల్లడించారు.

రాహుల్ గాంధీ ప్రకారం, ఈ నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ఓటర్ల జాబితాలలో అక్రమాలు జరిగి, కొన్ని వర్గాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా పనిచేశాయని ఆరోపించారు. ఆయన బృందం సేకరించిన వివరాలు, ఫోటోలు, మరియు పత్రాలను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు.

రాహుల్ గాంధీ వెల్లడించిన ఐదు రకాల మోసాలు:

1. డుప్లికేట్ ఓటర్లు:

దర్యాప్తులో 11,965 మంది డుప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు తేలిందని రాహుల్ గాంధీ చెప్పారు. కొంతమంది ఓటర్లు ఒకే పేరుతో రెండు లేదా అంతకంటే ఎక్కువ పోలింగ్ బూత్‌లలో నమోదు అయ్యి ఉండగా, మరికొందరు వేర్వేరు రాష్ట్రాల్లో కూడా ఓటు వేసిన రికార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉదాహరణలకు అనుగుణంగా, ఒకే ఓటరు పేరు, జన్మతేది, తండ్రి పేరు వేర్వేరు ఓటరు జాబితాల్లో కనిపించిందని పేర్కొన్నారు.

2. నకిలీ చిరునామాలు:

మొత్తం 40,090 మంది ఓటర్ల చిరునామాలు తప్పుడు లేదా ధృవీకరించలేనివిగా బయటపడ్డాయని తెలిపారు. చాలా చిరునామాలు వాస్తవానికి ఖాళీ స్థలాలు, వాణిజ్య సముదాయాలు లేదా లేనిపోని ఇళ్లు అని ఆయన చెప్పారు. ఈ విధంగా, వాస్తవ నివాసం లేకుండానే ఓటర్ల పేర్లు చేర్చడం జరిగింది.

3. ఓటర్ల గుంపులు (Voter Clustering):

రాహుల్ గాంధీ బృందం ప్రకారం, 10,452 మంది ఓటర్లు ఒకే చిరునామాలో నమోదు అయ్యి ఉన్నారు. కొన్నింటిలో 20 నుంచి 50 వరకు ఓటర్లు ఒకే ఇంటి చిరునామాకు చెందినవారిగా నమోదు చేయబడ్డారని, ఇది అసంభవమని ఆయన పేర్కొన్నారు. ఈ రకమైన "ఓటరు క్లస్టరింగ్" అనేది, ఒక గుంపు ఓట్లు నిర్దిష్ట అభ్యర్థి పక్షాన మళ్లించే కుట్రలో భాగమని ఆయన అన్నారు.

4. చెల్లని ఫోటోలు:

దర్యాప్తులో 4,132 మంది ఓటర్లకు ఫోటోలు లేకపోవడం లేదా ఫోటోలు ఉన్నా అవి స్పష్టంగా గుర్తుపట్టలేనివిగా ఉండటం బయటపడింది. ఇలాంటి ఫోటోలు ఉన్న ఓటర్ల విషయంలో ఎవరికైనా ఇతరులుగా వేషం వేసి ఓటు వేయడానికి అవకాశం కల్పించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

5. ఫారమ్ 6 దుర్వినియోగం:

ఓటరు నమోదు లేదా నియోజకవర్గ మార్పుల కోసం ఉపయోగించే ఫారమ్ 6ను దుర్వినియోగం చేసి 33,692 ఓట్లు జమ చేసినట్లు ఆయన ఆరోపించారు. పాత ఓటరు వివరాలను తొలగించి, కొత్తగా కల్పిత ఓటర్లను చేర్చడంలో ఈ ఫారమ్‌ను విస్తృతంగా వాడారని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ డిమాండ్లు:

ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ, సంబంధిత పోలింగ్ బూత్‌ల సీసీటీవీ ఫుటేజీని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, మొత్తం ఓటరు జాబితా డేటాకు యాక్సెస్ ఇవ్వాలని, అలాగే ఫారమ్ 6 దరఖాస్తులపై స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. "ప్రజాస్వామ్యం పారదర్శకతపై ఆధారపడి ఉంటుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు ఉంటే, ఎన్నికల ఫలితాలపై ప్రజల నమ్మకం కోల్పోతుంది," అని ఆయన అన్నారు.

ఎన్నికల సంఘం ప్రతిస్పందన:

రాహుల్ గాంధీ ఆరోపణలకు ఎన్నికల సంఘం (ECI) స్పందిస్తూ, ఆయన మరియు కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై అధికారిక ఫిర్యాదు దాఖలు చేయాలని సవాలు చేసింది. ఎన్నికల సంఘం ప్రకారం, ఆరోపణలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కానీ దానికోసం సాక్ష్యాలతో కూడిన ఫిర్యాదు అవసరమని పేర్కొంది.

బీజేపీ స్పందన:

ఈ ఆరోపణలను బీజేపీ పూర్తిగా నిరాకరించింది. పార్టీ ప్రతినిధులు రాహుల్ గాంధీ ఆరోపణలను "అసత్యం"గా, "రాజకీయ నాటకం"గా అభివర్ణించారు. "ఎన్నికలలో ఓటమిని అంగీకరించలేకపోయి, కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది," అని బీజేపీ ప్రతినిధి అన్నారు.

రాజకీయ ప్రభావం:

రాహుల్ గాంధీ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై ప్రశ్నలు లేవడంతో, పలు రాజకీయ విశ్లేషకులు ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ruling party మరియు opposition మధ్య మాటల యుద్ధం ముదిరే అవకాశం కనిపిస్తోంది.

రాజస్థాన్‌లో ప్రారంభానికి ముందే రోడ్డుకి చేదు గతి
దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో నదులు ఉప్పొంగి, అనేక చోట్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయి. రహదారులు, బ్రిడ్జిలు ధ్వంసమవుతున్నాయి.తాజాగా రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లో కూడా పరిస్థితి ఘోరంగా మారింది. ఝుంఝును (Jhunjhunu) జిల్లాలోని ఉదయపూర్వతి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కట్లి నది (Katli River) ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతికి బఘలి-జహాజ్, ఝుంఝును-సికార్‌లను కలిపే నూతన రోడ్డుపై విరుచుకుపడి దానిని కొట్టుకుపోయింది. ఈ రోడ్డును రెండు జాతీయ రహదారులను అనుసంధానిస్తూ ఆరు నెలల క్రితం నిర్మించారు. ఇంకా అధికారికంగా ప్రారంభించకముందే, వరదలు దాన్ని నాశనం చేయడం స్థానికులను నిర్మాణ నాణ్యతపై ఆందోళనకు గురి చేస్తోంది.

మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ.....
లోక‌ల్ గైడ్: మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ భగ్గుమన్నది. థానేలో చోటుచేసుకున్న ఘటనపై ఎంఎన్ఎస్ (MNS) పార్టీ ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహించింది. షాపు ఓనర్లు ఇచ్చిన నిరసన పిలుపుకు వ్యతిరేకంగా ఎంఎన్ఎస్ నేతలు ర్యాలీకి దిగారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లేకపోవడంతో, స్థానిక నేత అవినాశ్ జాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఇచ్చిన ర్యాలీ పిలుపును పోలీసులు అడ్డుకున్నారు. మీరా-భయాందర్ ప్రాంతంలో ర్యాలీని నిర్వహించాలనుకున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేతో పాటు పాల్ఘర్ జిల్లాలో కూడా ఎంఎన్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు అవినాశ్ జాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వీడియోను ఎంఎన్ఎస్ పార్టీ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.మీరా-భయాందర్‌లో ఎంఎన్ఎస్ మోర్చాకు అనుమతి ఇచ్చినట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. అయితే, ర్యాలీ రూటును మార్చాలని సూచించినప్పటికీ, పార్టీ అంగీకరించలేదని ఆయన ఆరోపించారు.భాషా వివాదం జూలై 1న భయాందర్‌లో  గురైయింది. ఆ రోజు ఫుడ్‌స్టార్ షాప్ ఓనర్‌పై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మరాఠీ మాట్లాడకపోవడం కారణంగా అతడిని కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జోధ్‌పూర్ స్వీట్స్ షాప్‌లో ఉద్యోగి హిందీ మాట్లాడడంతోనే ఈ వివాదం మొదలైందని గుర్తించారు.ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడితో పాటు, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు కూడా మహారాష్ట్రలో భాషా వివాదాన్ని మరింత ఉద్రిక్తతకు తీసుకెళ్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు....
లోక‌ల్ గైడ్ :

ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు X వేదికగా వెల్లడించారు. నెలరోజుల పాటు ఆగస్టు 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు కీలక బిల్లులకు ఆమోదం పలికే ఛాన్స్ ఉంది. మరోవైపు జాతీయ భద్రతపై చర్చించేందుకు ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి.