వృద్ధుల పోషణ విస్మరిస్తే జైలు కే
సీనియర్ సిటిజెన్స్ అస్సోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు.
జగిత్యాల ఫిబ్రవరి 20 లోకల్ గైడ్ :
వృద్ధ తల్లి దండ్రులను నిరా దరిస్తున్న కొడుకులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అస్సోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి డివిజన్లలోని వివిధ మండలాలకు చెందిన వృద్ధులు చేసిన ఫిర్యాదులపై వారి కొడుకులను పిలిపించి వృద్ధ తల్లిదండ్రులను పోషించకుండా వేధింపులకు, నిరాధరణకు గురిచేస్తే సంబందించిన ఆర్డీవోలు 6మాసాల జైలు శిక్ష తో పాటు, తల్లి దండ్రుల నుంచి తీసుకున్న ఆస్తులను తిరిగి ఆ తల్లి దండ్రుల పేరిట పట్టా మార్పిడి చేయించడం జరుగుతుందని ఆ కొడుకులను హెచ్చరించారు.
జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి డివిజన్ల లో కొందరికి పడ్డ శిక్ష లను వివరించారు. అనంతరం వారు స్టాంప్ పేపర్ పై ఒప్పంద పత్రాలు రాసిచ్చి తల్లి దండ్రులను వెంట తీసుకెళ్లారు.
ఈ కౌన్సిలింగ్ లో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరి శెట్టి విశ్వనాతం, ఉపాధ్యక్షులు పి. సి. హన్మంత్ రెడ్డి, పి. అశోక్ రావు, వి. ప్రకాష్ రావు, ఎం. డి. యా కూబ్, కరుణ లు పాల్గొన్నారు.
