పేదల కళ్లల్లో ఆనందమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం.

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పెద్దగుట్ట తండాలో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం.

పేదల కళ్లల్లో ఆనందమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం.

పాల్గొన్న మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్ రెడ్డి

లోకల్ గైడ్ కొత్తూరు.

నిరుపేదల కళ్లల్లో ఆనందం నింపడమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.శుక్రవారం కొత్తూరు మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో
తీగాపూర్, పెద్దగుట్ట తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందని అన్నారు.నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు జయప్రద జగన్మోహన్ రెడ్డి, ఉప్పల దయానంద్ గుప్తా,బోకుల శ్రీరాములు,ఉప సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ రాందాస్ నాయక్, మాజీ ఉపసర్పంచ్ దయ్యాల మల్లేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డే శేఖర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు దయ్యాల శ్రీను, పద్మారావు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గూడూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గూడూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
లోకల్ గైడ్ కొత్తూరు. ప్రజాపాలనలో ప్రజలకు పలు సంక్షేమ,అభివృద్ధి ఫలాలు అందిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం కొత్తూరు మండలంలోని గూడూరులో రూ.23 లక్షలతో సిసి...
పేదల కళ్లల్లో ఆనందమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం.
జే.ఎల్ సంఘం డైరీ ఆవిష్క రణ 
టేబుల్ టెన్నిస్‌లో వరంగల్‌కు స్వర్ణం!
పేదోడి సొంతింటి కళ కాంగ్రెస్ తోనే సాధ్యం.
వృద్ధుల పోషణ విస్మరిస్తే జైలు కే 
పంచాయతీ కార్మికుడి మృతి బాధాకరం.