గూడూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

రూ.23 లక్షలతో అండర్ డ్రైనేజ్, సిసి రోడ్ పనులు ప్రారంభం.

గూడూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

లోకల్ గైడ్ కొత్తూరు.

ప్రజాపాలనలో ప్రజలకు పలు సంక్షేమ,అభివృద్ధి ఫలాలు అందిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం కొత్తూరు మండలంలోని గూడూరులో రూ.23 లక్షలతో సిసి రోడ్డు,అండర్ డ్రైనేజ్ పనులను సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్త తో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని,ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య,వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తుచేశారు.గ్రామాలలో సీసీ రోడ్డు,డ్రైనేజీలు ఇబ్బందులు పడ్డారని,ఇప్పుడు గ్రామాలలో సీసీ రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్ రెడ్డి,మున్సిపాలిటీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, సర్పంచ్ బోకుల శ్రీరాములు,పిఎసిఎస్ వైస్ చైర్మన్ పద్మారావు,మాజీ సర్పంచ్ రాందాస్ నాయక్,ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు వడ్డే శేఖర్, పీర్లగూడెం మహేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి మోడీ దర్శన్,ఉప సర్పంచ్లు ఆరోగ్యం,వార్డ్ సభ్యులు శివ చారి,లక్ష్మి చంద్రయ్య,మోడీ వినోద్ద,శ్రీదేవి, అరవింద్,జ్ఞానేశ్వర్,దేవేందర్, స్వప్న,సుజనమ్మ,కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గూడూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గూడూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
లోకల్ గైడ్ కొత్తూరు. ప్రజాపాలనలో ప్రజలకు పలు సంక్షేమ,అభివృద్ధి ఫలాలు అందిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం కొత్తూరు మండలంలోని గూడూరులో రూ.23 లక్షలతో సిసి...
పేదల కళ్లల్లో ఆనందమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం.
జే.ఎల్ సంఘం డైరీ ఆవిష్క రణ 
టేబుల్ టెన్నిస్‌లో వరంగల్‌కు స్వర్ణం!
పేదోడి సొంతింటి కళ కాంగ్రెస్ తోనే సాధ్యం.
వృద్ధుల పోషణ విస్మరిస్తే జైలు కే 
పంచాయతీ కార్మికుడి మృతి బాధాకరం.