పేదోడి సొంతింటి కళ కాంగ్రెస్ తోనే సాధ్యం.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లందిస్తాం. - ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
కలెక్టర్ తో కలిసి ఇందిరా మహిళ ఇళ్ల పరిశీలన.
లోకల్ గైడ్/ తాండూర్:
పేదోడి సొంతింటి కల సహకారం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం
తాండూర్ పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ ను ఇళ్లను జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నియోజకవర్గంకు 3500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని,కొన్ని గ్రామాలలో గృహప్రవేశం కూడ చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు పూర్తిగా మౌళిక సదుపాయలు కల్పించిన వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అర్హుల జాబితా సిద్దం చేయడం జరుగుతుంది అని తెలిపారు.నిరుపేదలై ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం లేని అర్హులైన వారికీ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ ను కేటాయించడం జరుగుతుందనీ ఎవరు కూడా అధైర్యం, ఆందోళన చందోద్దని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్ ,మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ , కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
