పంచాయతీ కార్మికుడి మృతి బాధాకరం.
మంచి కార్మికుడిని కోల్పోయాము. - గ్రామ సర్పంచ్ డివై చిన్న నరసింహులు.
మృతుడి కుటుంబానికి రూ.10 వేల నగదు అందజేత.
లోకల్ గైడ్/తాండూర్:
పెద్దేముల్ గ్రామపంచాయతీలో వాటర్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న కార్మికుడు చాకలి నరసింహులు మృతి బాధాకరమని గ్రామ సర్పంచ్ డివై చిన్న నరసింహులు, ఉపసర్పంచ్ డివై ప్రసాద్ సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో, కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించే క్రమంలో, మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ డివై నర్సింలు, ఉప సర్పంచ్ డివై ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి లాలప్ప... మృతుడి కుటుంబానికి పంచాయతీ తరపున అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేల నగదనం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి మాట్లాడుతూ... గ్రామపంచాయతీ సిబ్బందిలో ఎవరికి ఆపద వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. కాగా చాకలి నరసింహులు మృతి మా అందరి హృదయాలను కలిసి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింలు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఎప్పుడు పలకరించిన ఆప్యాయత అనురాగాలతో పలకరించే వారిని స్మరించుకున్నారు. తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, అంబరయ్య,సీను, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
