అనిల్‌ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం

అనిల్‌ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం

ష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న అనిల్‌ అంబానీకి మరో దెబ్బ తగిలింది. తన నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ మార్చి త్రైమాసికంలో రూ.397.66 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది.

అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.321.79 కోట్ల లాభాన్ని ఆర్జించిన కంపెనీ ఇప్పుడు దానిని మించి నష్టాన్ని చవిచూసింది.

ఇంధన వ్యయాలు పెరగడం వల్లే ఈ నష్టం వాటిల్లినట్లు కంపెనీ తెలిపింది. నష్టాలు ఉన్నప్పటికీ కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,193.85 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది రూ.1,853.32 కోట్లతో పోలిస్తే ఇది అధికం. అయితే ఈ త్రైమాసికంలో వినియోగించిన ఇంధన వ్యయం రూ.953.67 కోట్లకు పెరిగింది. 2022-23 జనవరి-మార్చి కాలంలో ఇది రూ.823.47 కోట్లు.

పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే రిలయన్స్ పవర్ నష్టాలు గణనీయంగా ఎగిసి రూ.470.77 కోట్ల నుంచి రూ.2,068.38 కోట్లకు పెరిగాయి. ఇక క్యూ4లో రిలయన్స్ పవర్ దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. కాగా సెబీ నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు (ఎఫ్‌సీసీబీలు), సెక్యూరిటీల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
- జీవో 317పై తుది గడువు ఈ నెల 30 : మంత్రివర్గ ఉపసంఘంనవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం...
రాత పరీక్ష లేకుండానే DRDOలో ఉద్యోగాలు.. నెలకు రూ. 37000 జీతం
నిరుద్యోగులకు బంపర్ న్యూస్.. సింగరేణిలో కొలువుల జాతర
మహిళలకు గుడ్ న్యూస్... తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం
జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్‌కు మరోసారి చాన్స్
హైదరాబాద్ లో ప్రముఖ సంస్థ పెట్టుబడులు.. సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ
పగ, ప్రతీకార రాజకీయాలకు పరాకాష్టగా రేవంత్ పరిపాలన: దాసోజు