ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీకి భారత్‌లో నూతన అధ్యాయం – కర్ణాటకలో తొలి కేంద్రం

ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీకి భారత్‌లో నూతన అధ్యాయం – కర్ణాటకలో తొలి కేంద్రం

లోక‌ల్ గైడ్, బెంగళూరు: భారత్‌లో ప్రైవేట్ రంగంలో తొలిసారి హెలికాప్టర్ల తయారీకి శ్రీకారం చుట్టారు. యూరప్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ మరియు భారతీయ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) సంయుక్తంగా కర్ణాటకలోని కోలార్ జిల్లా వేమగల్ పారిశ్రామిక వాడలో హెచ్125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి.ఈ ప్రాజెక్టు తొలి దశలో 10 హెలికాప్టర్లను తయారు చేసి, తదుపరి 20 ఏళ్లలో 500 యూనిట్ల తయారీ లక్ష్యంగా విస్తరించనున్నారు. భారతీయ సాంకేతికతతో తయారు చేయనున్న ఈ హెలికాప్టర్లను దేశీయ అవసరాలు, భారత సైన్యం మరియు అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేయనున్నారు.ఫ్రాన్స్‌, అమెరికా, బ్రెజిల్ తర్వాత హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం కలిగిన నాలుగో దేశంగా భారతదేశం గుర్తింపు పొందనుంది. మొత్తం 7.40 లక్షల చదరపు అడుగుల భూమిలో హెలికాప్టర్ల తయారీ, నిర్వహణ, మరమ్మతులు మరియు ఒప్పంద ఆధారిత కార్యకలాపాలు (MRD) నిర్వహించనున్నారు.ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా 'ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ విండో' ఏర్పాటుచేసినట్లు భారీ పరిశ్రమల శాఖ ప్రకటించింది.ఈ నిర్ణయం దేశీయ రక్షణ, విమానయాన రంగాల్లో ఆత్మనిర్భర భారత్ దిశగా మైలురాయిగా నిలవనుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 అల్లు అర్జున్ – పుష్ప: ది రూల్ లో అద్భుత ప్రదర్శన అల్లు అర్జున్ – పుష్ప: ది రూల్ లో అద్భుత ప్రదర్శన
2025 సంవత్సరానికి ఉత్తమ ప్రధాన నటుడిగా శ్రీ అల్లు అర్జున్ ఎంపికయ్యారు, ఆయన అందించిన అద్భుత నటనకు గుర్తింపుగా పుష్ప: ది రూల్ చిత్రం ఎంతో ముఖ్యమైన...
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతల ప్రకటన
చిత్ర పరిచయం: సమాజ దృక్పథాన్ని మార్చే ప్రయత్నం
ఉత్తమ ఫీచర్ సినిమాలు: 2025లో ప్రేక్షకులను కట్టిపడేసిన మూడు చిత్రాలు
హైదరాబాద్‌కు చెందిన హార్వెస్టెడ్ రోబోటిక్స్‌ కంపెనీలో ఉద్యోగుల ఆనందానికి స్పెషల్ ఆఫీసర్!
టీఎస్ దోస్త్‌ 2025 ఫేజ్-1 సీట్ల కేటాయింపు మే 29న విడుదల
ఇంటర్‌స్టేట్‌ బాలల అక్రమ రవాణా ముఠా బస్టింగ్ – సూర్యాపేటలో సంచలనం