గోదారంగనాయకా స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి .....
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
లోకల్ గైడ్ : గోదారంగనాయకస్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. ఆ భగవంతుని దివేనలతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువై , రాష్ట్రాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు. భోగి పర్వదినం సందర్భంగా దేవరకొండ పట్టణంలోని గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన గోదారంగనాధ స్వామి కల్యాణోత్సవ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. కల్యాణోత్సవ కార్యక్రమాన్ని ఇరువురు తిలకించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి ,బాలు నాయక్ గార్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని హామీనిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి దృష్టికి తీసుకువెళ్లి , ప్రభుత్వం నుండి నిధులను మంజూరు చెపిస్తానని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా ,స్థానిక నాయకులు ,వేలాదిమంది భక్తులు, తదితరులు పాల్గొన్నారు .
Comment List