పూరి జగన్నాథ ఆలయంలో భద్రత కట్టుదిట్టం
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం
చేశారు. ఆలయం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఎన్‌ఎస్‌జీ కమాండోలు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచాలని, అవసరమైతే అదుపులోకి తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. స్పెషల్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దింపడంతో పాటు, పెట్రోలింగ్‌ను కూడా పెంచుతున్నామని చెప్పారు.పూరి ఆలయంతో పాటు, సాంబల్‌పూర్ జిల్లా హీరాకుడ్ డ్యామ్ వద్ద కూడా భద్రతను బలపరిచారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన డ్యామ్ కావడం గమనార్హం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ డ్యామ్ వద్ద పర్యాటకులను అనుమతించవద్దని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని చెప్పారు.ఇక భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం, జగత్‌సింగ్‌పూర్‌లోని పారాదీప్ పోర్ట్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, బాలాసోర్‌లోని డీఆర్‌డీవో కేంద్రంలో రక్షణ శాఖ అధికారులు అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించి కీలక అంశాలపై చర్చించారు.
Comment List