R&R సెంటర్ కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మంత్రికి వినతి

R&R సెంటర్ కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మంత్రికి వినతి

లోకల్ గైడ్:

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామంలోని R&R సెంటర్ కు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని గట్టు మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. శనివారం ధరూరు మండల కేంద్రంలో జరిగిన భూభారతి 2025 చట్టంఅవగాహన సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 2006 లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా నెట్టెంపాడు ప్రాజెక్టులో ముంపునకు గురైనదన్నారు.   2024 ఆగస్టులో వచ్చిన భారీ వర్షాలకు గ్రామం నీటిలో ముప్పున గురైనదని, గ్రామంలోకి నీరు వచ్చి చేరడంతో నిర్వాసితులమైన మేము తలో దిక్కు వెళ్లి  ప్రభుత్వం ఏర్పాటు చేసిన R&R సెంటర్ కు వెళ్లి అక్కడ గుడిసెలు వేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. రిజర్వాయర్ లో ఇండ్లు పొలాలను సర్వం కోల్పోయినా మాకు 360 పట్టా సర్టిఫికెట్లు ప్రభుత్వం పంపిణీ చేసినదన్నారు. మీరు మాపై దయవుంచి ప్రత్యేక ప్యాకేజీ కింద 360 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మాజీ ఎంపీపీ విజయకుమార్,  గ్రామ పెద్దలు శ్రీనివాసులు నర్సింలు, జయరాం గౌడ్, డీలర్ వెంకటేష్, తిమ్మారెడ్డి, వెంకటేష్ గౌడ్, గోయికల చిన్న వెంకటేష్, తదితరులు ఉన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia