టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 

నల్లగొండ జిల్లా ప్రతినిధి

టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 

లోకల్ గైడ్ :

నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సభ్యత్వం కార్డుల పంపిణి కార్యక్రమం నల్గొండ పార్లమెంట్ కన్వినర్  కసిరెడ్డి శేఖర్ రెడ్డి  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి  తుమ్మల మధుసూదన్ రెడ్డి  హాజరై కార్డుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1985 లో దేశ చరిత్ర లోనే సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అప్పటి నుండి ప్రతి రెండు సంవత్సరాలకు సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టి కార్యకర్తలకు ప్రమాదబీమా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం నారా చంద్రబాబు నాయుడు  ఈ  ప్రమాదబీమా ప్రవేశ పెట్టినట్లు  వారు  తెలిపారు. ఈ సభ్యత్వ కార్డు  కార్యకర్త కు ధైర్యం అని  అనుకోని పరిస్థితుల్లో  కార్యకర్తకు ఏమైనా అయితే ఈ కార్డు కార్యకర్త కుటుంబానికి చేయూత నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు,  ఎం, కె  ఐ సిద్ధిక్, బక్కతోళ్ళ ఇస్తారి, గోగుల నాగరాజు, ఆరేళ్ళ కొండల్, భూతం వెంకటయ్య,  భూతం మంజుల తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

  పాక్‌ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం – అప్రమత్తమైన భారత సైన్యం   పాక్‌ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం – అప్రమత్తమైన భారత సైన్యం
పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దును పూర్తిగా సీల్‌ చేయగా, అనుమానాస్పదంగా వ్యవహరించే వారిపై...
కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌ ఆశలకు చెన్నై గండికొట్టింది
ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం: మ్యాచ్‌లు జరుగుతాయా లేదా?
మన్యం వీరుడు అల్లూరి పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సవారమ్మ, మారెమ్మ అమ్మ  వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 
Yerra Yerrani Rumalu Gatti Singer Mallamma Emotional Interview | Anchor & Singer Manjula Yadav
‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై ప్రముఖుల ప్రశంసలు