ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్‌లో శృతి హాస‌న్ జతకట్టనుంది

ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్‌లో శృతి హాస‌న్ జతకట్టనుంది

లోకల్ గైడ్:

టాలీవుడ్ అగ్ర‌ క‌థానాయ‌కుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, స‌లార్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే.టాలీవుడ్ అగ్ర‌ క‌థానాయ‌కుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, స‌లార్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. #NTRNeel అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 31గా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మ‌రోవైపు మేలో తార‌క్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గోన‌బోతున్నాడు. మేక‌ర్స్ తార‌క్‌తో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకు చాలా ముఖ్యమైనవని సమాచారం.ఇదిలావుంటే ఈ మూవీకి సంబంధించి ఒక వార్త ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కూడా న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. చిత్ర బృందం ఇప్పటికే ఆమెను సంప్రదించారని, ఆమె కూడా అంగీకరించారని టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో శ్రుతి హాసన్ నర్తించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఆమె కథకు కీలకమైన పాత్రలో కూడా కనిపించవచ్చని తెలుస్తోంది. తారక్ పాత్ర మరియు ఆమె పాత్రల మధ్య ముఖ్యమైన సన్నివేశాలు ఉంటాయని సమాచారం. శ్రుతి హాసన్ గతంలో ఎన్టీఆర్‌తో రామ‌య్య వ‌స్తావ‌య్య అనే సినిమాలో చేసింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia