ఘనంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డా. పల్లా 

ఘనంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

లోకల్ గైడ్ : బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలునిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి  హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా. పల్లా  మాట్లాడుతూ.25సంవత్సరాల్లోకి భారత రాష్ట్ర సమితి అడుగు పెట్టింది. ఉజ్వల చరిత్ర కలిగిన పార్టీ బిఆర్ ఎస్..2001ఏప్రిల్ 27న పురుడు పోసుకుంది.అధినేత కెసిఆర్  త్యాగంతో పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది.తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్య త్వానికి, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసాడు. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వచ్చారు. గులాబీ జెండాను ఎగరావేసి అత్యంత తక్కువ సమయం లో 90జడ్పీటీసీలు గెలిపించుకున్నారు.అనేక పార్టీల వారు జెండా ఏదయినా అజెండా ఒక్కటే అని ఏకతాటి పై తీసుకోచ్చారు. దేశంలో 34పార్టీల నుంచి మద్దత్తు సంపాదించి పార్లమెంట్ లో తన యొక్క చాణిక్యతను ప్రదర్శించి 2014లో తెలంగాణను సాధించాం.2009లో ఇచ్చినట్లు చేస్తే మరల గమ్యాన్ని ముద్దాడిండు. 2014 లో 66సీట్లు సంపాదించి దేశం గర్వించేలా 24గంటల కరెంటు, కోటి ఎకరాలలు సాగునిరు,  రైతు భీమా, రైతులకు రుణమాఫీ ఇచ్చి దేశంలోనే తెలంగాణ లో నెంబర్ వన్ గా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16నెలలు గడుస్తున్నా రైతులకు భీమా లేదు.. బంధు లేదు..ఒడ్లకు బోనస్ ఇవ్వలేదు. ఇచ్చిన హామీలు నీటి మూటలగా మిగిలాయి.ఏమీ చేయలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది.ఆర్థిక పరిస్థితి మొత్తం కుంటు పడ్డది.ఎవరికి ఇబ్బంది లు వచ్చిన గులాబీ పార్టీ అండగా ఉంటుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News