త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ...
లోకల్ గైడ్ :
త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం ఇవాళ ఉదయం ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో జరిగింది. ఇందులో సీడీఎస్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, వైస్ ఎయిర్ చీఫ్ మరియు రక్షణ కార్యదర్శి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాల్పుల విరమణ, ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై వివరంగా చర్చించారని సమాచారం.పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై భారత్ ప్రతీకారం తీసుకున్న విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి ప్రతిస్పందన ఇచ్చింది. ఈ నేపథ్యంలో పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది. మధ్యాహ్నం 3:30కి ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ బ్రీఫింగ్‌లో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కీలక అంశాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకోనున్నారు. దానికి ముందు త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Comment List