ఢిల్లీ హై అలర్ట్‌ – ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ రెచ్చగొట్టే ప్రవర్తన,

ప్రభుత్వ సన్నాహకాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి..!

ఢిల్లీ హై అలర్ట్‌ – ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ రెచ్చగొట్టే ప్రవర్తన,

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశం విజయవంతంగా నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' పాక్‌కు జీర్ణించలేకపోయింది. దాంతో దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ విధించబడింది. భద్రతా కారణాలతో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేయబడగా, ఇండియా గేట్ వద్ద ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, స్థానికులకు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలన్న హెచ్చరికలు జారీ చేశారు.అత్యవసర పరిస్థితులకు సమర్థంగా స్పందించేందుకు వైద్య, విపత్తు నిర్వహణ విభాగాలు తమ సన్నద్ధతను సమీక్షిస్తున్నాయి. “పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. రాత్రి సమయంలో పటిష్ట నిఘా కొనసాగుతోంది. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నాం,” అని అధికారులు తెలిపారు.ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలోని పలు విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడినప్పటికీ, ముఖ్యంగా ఢిల్లీకి వచ్చే మరియు వెళ్లే విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.ఇదిలా ఉండగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహారాష్ట్ర విభాగం అన్ని ఆసుపత్రులను అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఔషధాలు, ప్రాణాధార పరికరాలు, అవసరమైన వైద్య సిబ్బంది, బెడ్స్ లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా సూచించింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాలు ఇదే తరహా ఆదేశాలు జారీ చేస్తుండటం గమనార్హం.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అమ్మ ఎదురుచూపు అమ్మ ఎదురుచూపు
    నవమాసాలు తల్లి గర్భగుడిలోఅపురూపంగా దాచుకొని పండంటి బిడ్డకై ఎదురు చూపు.....  తల్లి ఉగ్గు పాలు పోషి పెంచుతూస్వచ్ఛమైన ప్రేమను పంచుతూ తన గుండెలపై ఆడిస్తూ కమ్మనికథలతో
మళ్లీ దాడి చేసిన పాక్.. 
వర్ధన్నపేటలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు 
రోహిత్ బాట‌లోనే విరాట్ కోహ్లీ!
వారం రోజుల పాటు IPL వాయిదా....
భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పాకిస్తాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ....
ఉద్రిక్తతల వేళ భారత్ సైనిక శక్తి ప్రదర్శన