క్రేజీ కాంబోలో సినిమా... 

క్రేజీ కాంబోలో సినిమా... 

లోక‌ల్ గైడ్ :
యువ కథానాయకుడు శ్రీవిష్ణుకు విక్టరీ వెంకటేశ్ అభిమాన హీరో. ఈ విషయాన్ని అతను అనేకసార్లు మీడియాలో చెప్పారు. ఇటీవల విడుదలైన శ్రీవిష్ణు '#సింగిల్' మూవీలో పలువురు అగ్ర కథానాయకులను అతను ఇమిటేట్ చేశాడు. అందులో నూటికి నూరు శాతం దింపేసింది వెంకటేశ్‌ నే! '#సింగిల్' మూవీ క్లయిమాక్స్ లో శ్రీవిష్ణు వెంకటేశ్ తరహాలో నటించి, థియేటర్లలో నవ్వులు పూయించాడు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో దాదాపు ఇరవై కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. ఈ మధ్య కాలంలో శ్రీవిష్ణు సినిమాలు ఈ మాత్రం గ్రాస్ వసూలు చేసిందే లేదు. అయితే '#సింగిల్' సినిమా విజయం వెనుక శ్రీవిష్ణుకు మరో సెంటిమెంట్ కలిసొచ్చింది. ఈ సినిమా మే 9న విడుదలైంది. విశేషం ఏమంటే... ఇదే రోజున వెంకటేశ్ నటించిన 'ప్రేమించుకుందాం రా' మూవీ వచ్చింది. 1997లో విడుదలైన 'ప్రేమించుకుందాం... రా' సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వెంకటేశ్ కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది. ఆ రకంగా తన అభిమాన హీరో వెంకటేశ్ కు కలిసొచ్చిన మే 9వ తేదీనే శ్రీవిష్ణు సైతం '#సింగిల్' తో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*జులై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలి *ప్రతి పాడి పశువుకు ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగింగ్ కల్పించాలి *ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్షించిన జిల్లా...
ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !
గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రదేశం డ్రోన్ దృశ్యాలు.
క్రేజీ కాంబోలో సినిమా... 
పగడ్బందీగా ధాన్యం సేకరణ