ముందుగానే కేరళను తాక‌నున్న‌ నైరుతి రుతుపవనాలు 

ముందుగానే కేరళను తాక‌నున్న‌ నైరుతి రుతుపవనాలు 

లోక‌ల్ గైడ్:
 నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, మరో నాలుగు నుంచి ఐదు రోజులలో కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈనెల 27వ తేదీ నాటికల్లా రుతుపవనాలు కేరళకు చేరుకోవచ్చని మొదట అంచనా వేసిన ఐఎండీ, ఇప్పుడు అది అంతకంటే ముందే తాకే అవకాశముందని తెలిపింది. ఇది నిజమైతే, 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చిన మొదటి సందర్భం అవుతుందని చెప్పింది.

ఈ ఏడాది అధిక వర్షపాతం అవకాశం

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న కేరళలో ప్రవేశిస్తాయి, జూలై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయని తెలిపింది. అదే విధంగా సెప్టెంబర్ 17న వాయువ్య భారతం నుంచి ఉపసంహరణ ప్రారంభమై, అక్టోబర్ 15 నాటికి పూర్తవుతుంది. గతేడాది మే 30న రుతుపవనాలు దేశంలో ప్రవేశించగా, 2022లో ఇది మే 23న ప్రారంభమైందని తెలిపింది.

రుతుపవనాల ప్రాధాన్యత

దేశంలో సాగుభూమిలో సుమారు 52% వర్షపాతం మీద ఆధారపడి ఉంటుందని తెలిపింది. అందువల్ల నైరుతి రుతుపవనాలు భారతదేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో కీలకపాత్ర పోషిస్తాయని వివరించింది. జలాశయాలను నింపడం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక అవసరాలకు ఇవి ప్రధాన ఆధారమని పేర్కొంది. అంతేకాకుండా దేశ జీడీపీలో 18.2% కు ఈ వర్షపాతమే తోడ్పడుతుందని వెల్లడించింది.

తెలంగాణలో వర్ష సూచన

తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.మంగళవారం వర్షం కురిసిన జిల్లాల్లో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురంలో అత్యధికంగా 5.92 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

శ్రీధర్ బాబు రాజకీయ జీవితం: చిత్తశుద్ధి, ప్రజాసేవకు నిలువెత్తు రూపం శ్రీధర్ బాబు రాజకీయ జీవితం: చిత్తశుద్ధి, ప్రజాసేవకు నిలువెత్తు రూపం
తెలంగాణలో ప్రజల మద్దతుతో మలమలలాడుతున్న రాజకీయ నాయకుల్లో ముఖ్యుడైన బండి శ్రీధర్ బాబు, రాజకీయాల పట్ల నిజమైన అంకితభావాన్ని కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఈయన ప్రస్తుత...
వీరోచిత త్యాగానికి ప్రతీక – అజయ్ అహుజా జీవితం దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం
మహబూబా ముఫ్తీ జీవితం: జమ్మూ కశ్మీర్ తొలి మహిళా సీఎం, రాజకీయ పోరాటానికి మరో పేరు
రాజా రామ్మోహన్ రాయ్ జయంతి: సమాజ సంస్కర్త జీవితాన్ని స్మరిస్తూ దేశవ్యాప్తంగా నివాళులు
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025: ప్రకృతిని పరిరక్షిద్దాం, భవిష్యత్‌ను బలోపేతం చేసుకుందాం
తెలంగాణలో భారీ వర్షాలు – పిడుగుల హెచ్చరిక జారీ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వెనక్కి తగ్గిన 2021 ఆపరేషన్‌పై పెంటగాన్ సమగ్ర సమీక్ష