17వ డివిజన్ లో పారిశుధ్య పనులను పరిశీలించిన కార్పొరేటర్
వరంగల్ టౌన్ ( లోకల్ గైడ్):
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ ఆదర్శ నగర్ లో మంగళవారం స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు పారిశుధ్య పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధి ఆదర్శ నగర్ లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల తో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రైనేజి ద్వారా మురుగు నీరు వెళ్లే విధంగా జేసీబీ సహాయంతో మరమ్మతులు చేపించారు.ఎప్పటికప్పుడు నీరు వెళ్లేవిదంగా డ్రైనేజి లు పరిశుభ్రపరచాలని సంబంధిత జవాన్ కు సూచిస్తూ,మంచి నీటి సమస్య ఉండటం వల్ల సంబంధిత అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంకర్ తెప్పించడం జరిగింది.వాటర్ సమస్య లేకుండా చూసుకోవాలని వాటర్ మ్యాన్ కు ఆదేశిస్తూ అదేవిధంగా కాలనీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు గోపగాని శంకర్,గ్రామ పార్టీ అధ్యక్షులు నిమ్మకాయల రాజు,ప్రధాన కార్యదర్శి షేక్ మాషుక్,యూత్ నాయకులు సుంకు శ్రీకాంత్,రబ్బానీ,నాయకులు,బోడ ధర్మ,జవాన్ రాజేష్,తదితరులు ఉన్నారు.
Comment List