మారిన ఐపీఎల్-18 నాకౌట్ మ్యాచ్‌ల వేదికలు
ఐపీఎల్ 2024 (సీజన్ 18) నాకౌట్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ మార్చింది. మొదట హైదరాబాదు మరియు కోల్‌కతా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, తాజా మార్పుల ప్రకారం ముల్లాన్‌పూర్ (చండీగఢ్), అహ్మదాబాద్ వేదికలుగా నిర్ణయించారు. టైటిల్ పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
మ్యాచ్‌ల తాజా షెడ్యూల్ ఇలా ఉంది:
-
మే 29: క్వాలిఫయర్ 1 – ముల్లాన్‌పూర్ (న్యూపీసీఏ స్టేడియం)
-
మే 30: ఎలిమినేటర్ – ముల్లాన్‌పూర్ (న్యూపీసీఏ స్టేడియం)
-
జూన్ 1: క్వాలిఫయర్ 2 – అహ్మదాబాద్
-
జూన్ 3: ఫైనల్ – అహ్మదాబాద్
ఈ మేరకు బీసీసీఐ మంగళవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ భారతం నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌లను ఉత్తర భారతదేశానికి మార్చినట్లు పేర్కొంది.
హైదరాబాద్ అభిమానులకు నిరాశ
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశాజనక ప్రదర్శనతో పోటీ నుంచి వెనకబడింది. అయినా కూడా నాకౌట్ మ్యాచ్‌లు తమ నగరంలో చూడాలని ఆశించిన అభిమానులకు తాజా మార్పులు తీవ్ర నిరాశను కలిగించాయి. ఇకపోతే మే 23న సన్‌రైజర్స్, బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను కూడా లక్నోకు తరలించినట్లు బీసీసీఐ ప్రకటించింది.
Comment List