క్షమాగుణం మెరుగైన
సామాజ విలువలకు వారథి
ప్రకృతి మనిషికి ఇచ్చిన
గొప్ప వరం క్షమాగుణం
క్షమించడం క్షమాపణ
చెప్పడం మనోశాంతికి
మార్గం
క్షమించడం క్షమాపణ
ప్రతికూల భావాలనుండి
మనల్ని మనం
రక్షించుకుంటాం
క్షమాపణ పగకు విరుగుడు
ఇతరుల పట్ల అవగాహన
పెంచుకోవడానికి వారధి
క్షమా గుణం మనిషిలో
అంతర్గత శాంతికి
మానసిక ప్రశాంతతకు
స్థిరత్వానికి వేదిక
సామాజిక విలువలకు
వారథి
ఒత్తిడిని తగ్గిస్తుంది
నిద్ర సంతోషాన్ని
సంతృప్తిని పెంచుతుంది
శక్తి సామర్ధ్యాలు పెరిగి
ఉత్పాదక సామర్థ్యం
జీవన ప్రమాణాలు
పెరుగుతాయి
అవగాహన ఆత్మీయత
ఆత్మగౌరవం మెరుగైన
సామాజిక విలువలు
కుల మతాల మధ్య
సామాజిక సమరసత
ఆవిష్కరణలకు
ఆలంభణగా నిలుస్తుంది
క్షమించడం క్షమాపణ
నీజీవనశైలి అవుతే
జీవితం ఆదర్శమౌతుంది
మన వల్ల తప్పు జరిగితే
అడుగకముందే క్షమాపణ
చెప్పండి చేసిన తప్పు నుండి
పాఠం నేర్చుకోండి
మనల్ని మనం
క్షమించుకోవాలి
జరిగిన తప్పును
పునరావృతం కాకుండా
చూసుకోవాలి
ఇతరుల తప్పుల
పట్ల అతిగా
స్పందించవద్దు
స్వరూపాన్ని బట్టి
స్పందించండి
కొన్ని తప్పులను
విస్మరించడం మంచిది
మరికొన్నింటిని క్షమించి
వదిలెయ్యండి
కొన్ని తప్పులను
సరిదిద్దే ప్రయత్నం
చేయండి కొన్ని సార్లు
కఠినంగా
వ్యవహరించకుండా
వదిలెయ్యండి
క్షమించడం క్షమాపణ
చెప్పడం అలవాటు
చేసుకుంటే జీవితం
మెరుగు పడుతుంది
క్షమా గుణం పరివ్యాప్తితో
హింసా రహిత సమాజ
స్థాపనకు కృషి చేద్దాం
నేదునూరి కనకయ్య
1)అద్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
Comment List