రాజ్యసభకు కమల్ హాసన్! 

 రాజ్యసభకు కమల్ హాసన్! 

లోక‌ల్ గైడ్ : మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో MNM కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ స్థానం కేటాయించడం ఖరారైంది.జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకు పోలింగ్ జరుగనుంది. అందులో తమిళనాడులో ఆరు, అస్సాంలో రెండు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. తమిళనాడుకు చెందిన అన్బుమణి రామదాస్, ఎం. షణ్ముగమ్, ఎన్. చంద్రశేగరన్, ఎం. మహమ్మద్ అబ్దుల్లా, పి. విల్సన్, వైగోలకు రాజ్యసభ పదవీకాలం జూలై 25తో ముగియనుంది. ప్రస్తుతం డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో, ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది.ఎంఎన్ఎం పార్టీ, విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఎంఎన్ఎం ప్రచారం చేసింది. తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లు, పుదుచ్చేరిలోని ఒక స్థానం కోసం MNM ప్రచారంలో పాల్గొంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా 2025లో MNM పార్టీకి రాజ్యసభ స్థానం ఇవ్వాలనే అంగీకారం అప్పుడే డీఎంకే నేతృత్వంలోని కూటమి ప్రకటించింది.కమల్ హాసన్, 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. అవినీతి, కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, అలాగే గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ పార్టీ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.ఇక అన్నాడీఎంకే విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బలం ఆధారంగా వారు ఒక రాజ్యసభ స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలరు. ఒకవేళ రెండో అభ్యర్థిని గెలిపించాలంటే, బీజేపీ, పీఎంకే మద్దతు కీలకం. ప్రస్తుతం బీజేపీ అన్నాడీఎంకే పక్షాన ఉన్న నేపథ్యంలో, ఈ రెండు పార్టీలు పరస్పర సహకారం చేసుకునే అవకాశముంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 అల్లు అర్జున్ – పుష్ప: ది రూల్ లో అద్భుత ప్రదర్శన అల్లు అర్జున్ – పుష్ప: ది రూల్ లో అద్భుత ప్రదర్శన
2025 సంవత్సరానికి ఉత్తమ ప్రధాన నటుడిగా శ్రీ అల్లు అర్జున్ ఎంపికయ్యారు, ఆయన అందించిన అద్భుత నటనకు గుర్తింపుగా పుష్ప: ది రూల్ చిత్రం ఎంతో ముఖ్యమైన...
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతల ప్రకటన
చిత్ర పరిచయం: సమాజ దృక్పథాన్ని మార్చే ప్రయత్నం
ఉత్తమ ఫీచర్ సినిమాలు: 2025లో ప్రేక్షకులను కట్టిపడేసిన మూడు చిత్రాలు
హైదరాబాద్‌కు చెందిన హార్వెస్టెడ్ రోబోటిక్స్‌ కంపెనీలో ఉద్యోగుల ఆనందానికి స్పెషల్ ఆఫీసర్!
టీఎస్ దోస్త్‌ 2025 ఫేజ్-1 సీట్ల కేటాయింపు మే 29న విడుదల
ఇంటర్‌స్టేట్‌ బాలల అక్రమ రవాణా ముఠా బస్టింగ్ – సూర్యాపేటలో సంచలనం