బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
బీఅర్ఎస్ యువజన నాయకుడు వజ్రాల రమేష్
లోకల్ గైడ్ :
వనపర్తి పట్టణ కేంద్రంలో బీఅర్ఎస్ యువజన నాయకులు వజ్రాల రమేష్ ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వనపర్తి పట్టణ కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన నాయకుడు వజ్రాల రమేష్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – "డాక్టర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా పేరుగాంచిన మహనీయుడు. భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చేసిన సేవలు అమోఘం. బడుగు, బలహీన, పేద వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచిన అంబేద్కర్ జీవితాన్ని ప్రతి యువతుడు ఆదర్శంగా తీసుకోవాలి. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది" అని చెప్పారు.వజ్రాల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు యువకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరూ కలిసి అంబేద్కర్ జీవితం, స్ఫూర్తిదాయక సందేశాలను స్మరించుకుంటూ, సంఘీభావం తెలిపారు.
Comment List