ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం
నల్లగొండ జిల్లా ప్రతినిధి .
లోకల్ గైడ్ :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో_ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ స్థానిక ఎన్టీఆర్ చౌరస్త వద్ద ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.. ఈ సందర్బంగా నగర సంయుక్త కార్యదర్శి సిలివేరు శివ మాట్లాడుతూ పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి మతం అడుగుతు కాల్పులు జరిపి అతి కిరాతకంగా చంపేశారు. ప్రశాంతంగా మారిన కాశ్మీర్ లో ఉగ్రవాదులు చొరబడి 27 మందికి పైగా హిందువుల ప్రాణాలు తీసారు మృతుల్లో హనీమూన్ కి వచ్చిన దంపతులు ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఉగ్రవాదులను వదిలిపెట్టకుండ ఉగ్రవాదాన్ని హత మార్చాలని డిమాండ్ చేశారు...అదేవిధంగా ఎల్లప్పుడూ సెక్యూలర్ అని చెప్పుకోబడే మేధావులు, రాజకీయ నాయకులు ఈ సంఘటన పైన ఎందుకు నోరు తెరువట్లేదని ప్రశ్నించారు. ఇక నైనా హిందవులు మేలుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకూరి శివ, సంపత్, విగ్నేష్, శంకర్,చందు, అరవింద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు..
Comment List