ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం 

నల్లగొండ జిల్లా ప్రతినిధి .

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం 

లోకల్ గైడ్ :

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో_  జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ స్థానిక  ఎన్టీఆర్ చౌరస్త వద్ద ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.. ఈ సందర్బంగా నగర సంయుక్త కార్యదర్శి సిలివేరు శివ మాట్లాడుతూ  పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి మతం అడుగుతు కాల్పులు జరిపి అతి కిరాతకంగా చంపేశారు. ప్రశాంతంగా మారిన కాశ్మీర్ లో ఉగ్రవాదులు చొరబడి 27 మందికి పైగా హిందువుల ప్రాణాలు తీసారు మృతుల్లో హనీమూన్ కి వచ్చిన దంపతులు ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఉగ్రవాదులను వదిలిపెట్టకుండ ఉగ్రవాదాన్ని హత మార్చాలని డిమాండ్ చేశారు...అదేవిధంగా ఎల్లప్పుడూ సెక్యూలర్ అని చెప్పుకోబడే మేధావులు, రాజకీయ నాయకులు ఈ సంఘటన పైన ఎందుకు నోరు తెరువట్లేదని ప్రశ్నించారు. ఇక నైనా హిందవులు మేలుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకూరి శివ, సంపత్, విగ్నేష్, శంకర్,చందు, అరవింద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే
లోకల్ గైడ్ అశ్వారావుపేట : ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మున్సిపాలిటీ...
హత్యా కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు
ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల సౌకర్యం తో జనరల్ ఆసుపత్రి ప్రారంభం
ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సీతక్క, ట్రై కార్ చైర్మన్ బేల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఎస్ టి ఎమ్మెల్యేల సమావేశం పార్టీలకు అతీతంగా హాజరైన st mla లు
రేపు పెంజర్ల లో అనంత పద్మనాభుడి కళ్యాణ మహోత్సవం