బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎదురు కాల్పులు 

బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎదురు కాల్పులు 

లోకల్ గైడ్: తెలంగాణ -చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మంగళవారం అలజడి రేగింది, ములుగు జిల్లాలోని కర్రే గుట్టలను 200 మంది భద్రత బలగాలు చుట్టు  ముట్టాయి. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.మావోయిస్టులను ఏరి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. భద్రతా బలగాలు మావోలపై ఉక్కు పాదం మోపుతున్నాయి. తాజాగా ఈరోజు ఉదయం బీజాపూర్ జిల్లా బేధారే పోలీస్ స్టేషన్ పరిధిలోని కేర్పె-తొడ్సంపార అటవీ ప్రాంతంలో మావోయిస్టు లకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.జరిగిన ఎన్కౌంటర్లో గుండిపురి RPC మిలిషియా ప్లాటూన్ కమాండర్ వెల్లా వాచమ్ అనే మావోయిస్టు మృతి చెందాడు ఇతనిపై మూడు లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాల 7వ బెటాలియన్, E కంపెనీ క్యాంప్ నూగూర్ తోడ్సం పార అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం మేరకు భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహించాయి.ఈ సమయంలో మావోయి స్టులు ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పులు అనంతరం ఆ ప్రాంతంలో గాలిస్తుండగా మావోయిస్టు మృతదేహం లభించింది. సంఘటన స్థలంలో 303 రైఫిల్ తో పాటు భారీ ఎత్తున మందు గుండు సామాగ్రినీ స్వాధీన పరుచుకున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia