జమ్ముకశ్మీర్ అసెంబ్లీ పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళి

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళి

లోకల్ గైడ్ :

పహల్గాం ఉగ్రదాడి మృతులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ నివాళులు JK Assembly | ఈ నెల 22న పహల్గాం (Pahalgam) సమీపంలోని బైసరన్‌ (Baisaran) లోయలో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన క్రూరమైన దాడిలో మరణించిన పర్యాటకులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ (JK Assembly) నివాళులు అర్పించింది. వారి మరణాలపట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించింది. JK Assembly : ఈ నెల 22న పహల్గాం (Pahalgam) సమీపంలోని బైసరన్‌ (Baisaran) లోయలో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన క్రూరమైన దాడిలో మరణించిన పర్యాటకులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ (JK Assembly) నివాళులు అర్పించింది. వారి మరణాలపట్ల సంతాపం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. గత మంగళవారం జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. వారిలో 25 మంది భారతీయులు, ఒకరు నేపాల్ జాతీయుడు ఉన్నారు.ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అందరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉగ్రదాడిపై సభలో చర్చించారు. అనంతరం మృతులకు నివాళి అర్పించారు. ఓ ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కునే క్రమంలో తూటాలకు బలైన స్థానికుడి త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు. ఆపై ఉగ్రదాడిని ఖండిస్తూ ఒక తీర్మానం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia