ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ

 ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ

లోకల్ గైడ్:

భార‌త్‌కు చెందిన క్వాడ్‌కాప్ట‌ర్‌ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చివేసింది. ఎల్వోసీ వ‌ద్ద ఎయిర్‌స్పేస్ ఉల్లంఘించిన‌ట్లు పాక్ ఆరోపించింది. మ‌రో వైపు ఓ దౌత్య‌వేత్త‌తో పాటు ఏడుగురు సిబ్బంది వాఘా బోర్డ‌ర్ రూట్లో పాక్‌లోకి ప్ర‌వేశించారు. 

ఇస్లామాబాద్‌: నియంత్రణ రేఖ వ‌ద్ద భార‌త్‌కు చెందిన క్వాడ్‌కాప్ట‌ర్‌ను పాకిస్థాన్ ఆర్మీ  కూల్చివేసింది. ఎల్వోసీ వ‌ద్ద ఎయిర్‌స్పేస్ ఉల్లంఘించిన‌ట్లు పాక్ వెల్ల‌డించింది. ఓ డ్రోన్ త‌ర‌హాలో క్వాడ్‌కాప్ట‌ర్ ప‌నిచేస్తుంది. బింబేర్‌లోని మ‌న్నావార్ సెక్టార్‌లో క్వాడ్‌కాప్ట‌ర్‌తో నిఘా చేప‌డుతున్న స‌మ‌యంలో దాన్ని కూల్చివేసిన‌ట్లు పాకిస్థాన్ ఆర్మీ పేర్కొన్న‌ది. ఎటువంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డినా, వాటిని తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు పాకిస్థాన్ ఆర్మీ పేర్కొన్న‌ది.

మ‌రో వైపు ఇండియాలో ఉన్న పాకిస్థానీలు తిరిగి స్వ‌దేశం వెళ్తున్నారు. వాఘా బోర్డ‌ర్ మార్గంలో కొంద‌రు వెళ్లారు. ఓ దౌత్య‌వేత్త‌తో పాటు ఏడుగురు సిబ్బంది వాఘా బోర్డ‌ర్ రూట్లో పాక్‌లోకి ప్ర‌వేశించారు. పాకిస్థాన్ దౌత్య‌వేత్త సోహెల్ ఖామ‌ర్‌తో పాటు న‌లుగురు సిబ్బంది లాహోర్‌కు చేరుకున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దౌత్య కార్యాల‌య సిబ్బందితో పాటు వాళ్ల ఫ్యామిలీలు కూడా పాక్‌కు చేరుకుంటున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia