భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆరోగ్య మౌలిక సదుపాయాలపై జేపీ నడ్డా సమీక్ష
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. దేశంలోని హాస్పిటల్స్ మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల సిద్ధతను ఆయన సమీక్షించారు. సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక దాడుల మధ్య, దేశంలోని ఆరోగ్య సదుపాయాల పర్యవేక్షణ నిరంతరంగా జరుగుతోందని అధికారులు మంత్రి జేపీ నడ్డాకు వివరించారు.
ఇదిలా ఉంటే, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులతో సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించి, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సరిహద్దుల్లో పాక్ తరఫున కొనసాగుతున్న దాడులను భారత్ ధీటుగా తిప్పికొడుతోంది.
Comment List