ప్రజా సమస్యలపై కలిసి పోరాడుదాం
జై స్వరాజ్ పార్టీ అధినేత కేఎస్ఆర్ గౌడ
హైదరాబాద్ (లోకల్ గైడ్) :
ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి కలిసి వచ్చే ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలతో ఉమ్మడిగా ఉద్యమం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు గాయంతో బాధపడుతున్న కేఎస్ఆర్ గౌడను ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్, ఆ పార్టీ నేతలు రాజు, తివారీ ఈ రోజు హైదరాబాద్లోని మెట్టుగూడలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో కలిసి పరామర్శించారు. అనంతరం ఆ నాయకులతో కేఎస్ఆర్ గౌడ అనేక ప్రజా సమస్యలపై చర్చించారు. మొదట ప్రజా సమస్యలపై పోరాటానికి కార్యాచరణ చేపడదామని, ఎన్నికల ముందు తదుపరి అంశాలు చర్చిద్దామని ఆయన వారికి వివరించారు. తమకు కూడా ఈ ఆలోచన నచ్చిందని ఐపిసీ అధ్యక్షుడు శ్రీధర్ అన్నారు. త్వరలో మరోసారి కలిసి ఒక అవగాహనతో ముందుకు పోదామని ఆయన కేఎస్ఆర్ గౌడతో పేర్కొన్నారు. ఈ సమావేశంలో జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్, పార్టీ నాయకులు దామోదర, గోలుకొండ లక్ష్మీ నారాయణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Comment List