ఎస్.బి.ఐ. బ్యాంకు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
కామారెడ్డి ,లోకల్ గైడ్ :
నిరుద్యోగ యువతలకు ఎస్.బి.ఐ , స్వరాజ సంస్థ సంయుక్తంగా నెల రోజుల పాటు ఉచితంగా నైపుణ్య శిక్షణ కల్పించారు . సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో 30 రోజులపాటు ఉచిత శిక్షణ పూర్తి చేసుకొన్న వారికి నిర్వహకులు ధ్రువ పత్రాలు అందచేశారు . ఎస్.బి.ఐ. బ్యాంకు ఆధ్వర్యంలో కుట్టు మిషన్ కు 12000 రూపాయలు , 6200 రూపాయలు నగదు అందించారు . 35 మంది నిరుద్యోగ యువతలకు గ్రామ స్వరాజ్య సంస్థ వారు మంగళవారం నైపుణ్య ధృవపత్రాలు అందజేశారు . ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ కోఆర్డినేటర్ ఆర్ .భానుప్రియ, కుప్రియాల్ ఐకెపి ఆంజనేయులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు భిక్కనూర్ లింగవ్వ , గ్రామ ప్రధాన కార్యదర్శి ఎస్. సంతోష్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ జె.నాగరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కూడలి సాయిలు, మిల్క్ సెంటర్ చైర్మన్ పి. ప్రతాపరెడ్డి, గ్రామ కరోబార్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comment List