సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం

సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం

లోక‌ల్ గైడ్ :
బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు తదితర ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ చరిత్ర సృష్టించారు. ఆయన 2000వ సంవత్సరంలో అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాదిగా, అనంతరం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, తరువాత నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రభుత్వ లాయర్‌గా సేవలందించారు. 2003లో మహారాష్ట్ర హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీకాలం 2025 నవంబర్ 23వ తేదీ వరకు కొనసాగుతుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News