అసంఘటిత కార్మికుల కనీసం పది రోజుల పని దినాలు కల్పించాలి

మేడే వేడుకల్లో కేఎస్ఆర్ గౌడ డిమాండ్

అసంఘటిత కార్మికుల కనీసం పది రోజుల పని దినాలు కల్పించాలి

హైదరాబాద్, లోకల్ గైడ్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అసంఘటిత, భవన నిర్మాణ కార్మికులకు నెలలో కనీసం పది రోజుల పని దినాలను ప్రభుత్వం కల్పించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కార్మికులు, కార్మిక సంఘాలు ఈ డిమాండ్ కోసం ఉమ్మడిగా పోరాడాలని కేఎస్ఆర్ గౌడ అన్నారు .  హైదరాబాద్లోని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ ఇందిరా నగర్ సెంటర్లో జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్, హౌసింగ్ బోర్డు పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మే డే ఉత్సవాలకు ఆయన ముఖ్య‌‌‌ అతిథిగా హాజరై కార్మికుల జెండా ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వలస కార్మికుల వల్ల స్థానికులకు ఉపాధి సమస్యలు తలెత్తుతున్నాయని, దీని పరిష్కారం కోసం స్థానికులకు నెలకు కనీసం పది రోజుల పని దినాల కల్పన చట్టం తీసుకురావాలని ఆయన సర్కార్ ను డిమాండ్ చేశారు. జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో త్వరలో అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నట్లు ఆ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి భవన నిర్మాణ కార్మికునికి సొంత ఇంటి కల సాకారం చేయాలని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడెం భిక్షపతి ప్రభుత్వాన్ని కోరారు.  యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్ని మండలాల్లో జేఎస్టీయూసీ కమిటీలను త్వరలో పూర్తి చేస్తామని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్ తెలిపారు. 60 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి లేబర్ కార్డు కొనసాగించాలని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ జేఎస్టీయూసీ అధ్యక్షుడు ఇంజ గణేష్ అన్నారు. 
ఈ మేడే ఉత్సవాల్లో మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ జేఎస్టీయూసీ ఉపాధ్యక్షుడు బొడికల వెంకట్, జేఎస్టీయూసీ మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రధాన కార్యదర్శి జయరాజ్, పెయింటర్స్ అసోసియేషన్ నాయకులు అమ్మనబోయిన నర్సయ్య, గంధమల్ల మోహన్ బాబు, జె.అశోక్, టి. బాలకృష్ణ, శ్రావణ్ కుమార్, సత్యనారాయణ, జయరాజ్, ఆర్.స్వామి, రాజు, చంద్రమౌళి, ఎస్. సాగర్, ఆర్. నవీన్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇసుక క్వారీని రద్దు చేయాలని  బిజెపి ధర్నా ఇసుక క్వారీని రద్దు చేయాలని  బిజెపి ధర్నా
లోకల్ గైడ్మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి దుందుభి వాగు నుండి ఇసుక తరలింపుకు అనుమతులు రద్దుచేసి ఇసుక కోరిని ఆపాలని మిడ్జిల్ మండల బిజెపి నాయకులు బుధవారం స్థానిక...
రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌గారితో మ‌ర్యాద‌పూర్వ‌కంగా 
నూతన కమిషనర్లుగా నియమితులైన వారితో ప్రమాణం 
అసంఘటిత కార్మికుల కనీసం పది రోజుల పని దినాలు కల్పించాలి
చెరువుగట్టు పై అద్భుతమైన పాట పాడిన సింగర్ & యాంకర్ మంజుల యాదవ్ #singermanjulayadav #shorts #lgmedia
 పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ.. జస్ట్‌ మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు!
స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు జంకుతున్నారు...ఎందుకో తెలుసా