నేటి నుంచి బీటింగ్ రీట్రీట్ పునః ప్రారంభం
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులతో నిర్వహించే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పంజాబ్‌లోని మూడు జాయింట్ చెక్‌పోస్టుల వద్ద ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం నేటి సాయంత్రం నుంచే తిరిగి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. అయితే, ఈ సందర్భంగా కొన్ని ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ముఖ్యంగా బీటింగ్ రీట్రీట్ సమయంలో పాకిస్తాన్ బార్డర్ గేట్లు తెరిచేలా అధికారులు సూచనలు జారీ చేశారు.తొలిరోజు ఈ కార్యక్రమాన్ని కేవలం మీడియా ప్రతినిధులకే అనుమతిస్తారు. ఇక రేపటి నుంచే సాధారణ ప్రజానీకానికి కూడా కార్యక్రమం వీక్షించేందుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
22 May 2025 00:00:00
తెలంగాణలో ప్రజల మద్దతుతో మలమలలాడుతున్న రాజకీయ నాయకుల్లో ముఖ్యుడైన బండి శ్రీధర్ బాబు, రాజకీయాల పట్ల నిజమైన అంకితభావాన్ని కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఈయన ప్రస్తుత...
Comment List