రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో ఛార్జీల తగ్గింపు...
లోకల్ గైడ్
హైదరాబాద్ మెట్రో ఛార్జీలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి రానుంది. తాజాగా సవరించిన ఛార్జీల ప్రకారం, కనీస టికెట్ ధరను రూ.12 నుంచి రూ.11కి తగ్గించారు. గరిష్ఠ ఛార్జీ రూ.75 నుంచి రూ.69కి తగ్గించబడింది.
మిగతా టికెట్ ధరల సవరింపు వివరాలు ఇలా ఉన్నాయి:
0–2 కి.మీ వరకు: రూ.12 నుంచి రూ.11కి
2–3 కి.మీ వరకు: రూ.18 నుంచి రూ.17కి
4–6 కి.మీ వరకు: రూ.30 నుంచి రూ.28కి
6–9 కి.మీ వరకు: రూ.40 నుంచి రూ.37కి
9–12 కి.మీ వరకు: రూ.50 నుంచి రూ.47కి
12–15 కి.మీ వరకు: రూ.55 నుంచి రూ.51కి
15–18 కి.మీ వరకు: రూ.60 నుంచి రూ.56కి
18–21 కి.మీ వరకు: రూ.66 నుంచి రూ.61కి
21–24 కి.మీ వరకు: రూ.70 నుంచి రూ.65కి
24 కి.మీ పైగా: రూ.75 నుంచి రూ.69కి
ఇటీవల మెట్రో ఛార్జీలను పెంచిన తర్వాత ప్రయాణికుల అభ్యర్థన మేరకు ఈ తగ్గింపును ప్రకటించారు. తాజా ధరలు శనివారం నుంచే అమలులోకి రానున్నాయి.
Comment List