హైదరాబాద్ లో బారీ వ‌ర్షం

హైదరాబాద్ లో బారీ వ‌ర్షం

గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఎండలు తగ్గి, ప్రజలకు వాతావరణంలో ఉపశమనం కలిగించింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గురువారం భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్, గోల్కొండ, టోలిచౌకి, మెహిదీపట్నం ప్రాంతాల్లో వర్షం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది.

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనిపై భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను విడుదల చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అక్కడ కూడా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News