ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి గట్టి కౌంటర్‌గా నిలిచింది:  కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి గట్టి కౌంటర్‌గా నిలిచింది:  కేంద్ర హోం మంత్రి అమిత్ షా

లోక‌ల్ గైడ్ :

పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి గట్టి కౌంటర్‌గా నిలిచిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పహల్గాం దాడులతో ఉగ్రవాదులు అన్ని మానవీయ హద్దులు దాటి పోయారని, వారిని నిర్మూలించేందుకు భారత సైన్యం మెరుపుదాడులు నిర్వహించిందని చెప్పారు.భారత దళాలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నదనే సత్యం ప్రపంచానికి మళ్లీ నిరూపితమైందన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచ దేశాలు ప్రశంసించాయని అమిత్ షా తెలిపారు.ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల బలమైన రాజనీతిక సంకల్పం, నిఘా సంస్థల నుంచి వచ్చిన ఖచ్చితమైన సమాచారం, త్రివిధ దళాల అద్భుత కృషి కారణమని చెప్పారు.
పాక్‌ క్షిపణి దాడులను ఎదుర్కొనే సమయంలో బీఎస్ఎఫ్‌ కీలక పాత్ర పోషించిందని, అంతర్జాతీయ సరిహద్దులను కాపాడటంలో బీఎస్ఎఫ్‌ సేవలను ఆయన ప్రశంసించారు. పాకిస్థాన్‌ అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌కు సమస్యలు సృష్టిస్తోందని చెప్పారు.పహల్గాం దాడి సమయంలో ఉగ్రవాదులు పర్యాటకులను మతపరంగా లక్ష్యంగా చేసుకొని హత్య చేసిన దారుణాన్ని అమిత్ షా తీవ్రంగా ఖండించారు.ఆపరేషన్ సిందూర్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలను భారత దళాలు ధ్వంసం చేశాయని, వాటిలో రెండు ప్రధాన కేంద్రాలుగా పనిచేస్తున్న స్థావరాలేనని వెల్లడించారు. ఈ దాడుల్లో పాక్ పౌరులకు గానీ, సైనిక స్థావరాలకు గానీ నష్టం కలగలేదని స్పష్టంగా చెప్పారు.అయితే పాక్ సైన్యం నిషేధిత ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరవడం వల్ల, ఆ దేశం ఉగ్రవాదానికి ఎలా మద్దతు ఇస్తోందన్న విషయాన్ని ప్రపంచం మొత్తం గమనించిందని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదుల వెనక ఎవరున్నారు అన్న విషయం అంతర్జాతీయ సమాజానికి పూర్తిగా అర్థమైందని తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 "మైసూర్ పాక్  కాదు మైసూర్ శ్రీ‌..... "మైసూర్ పాక్  కాదు మైసూర్ శ్రీ‌.....
పహల్గాం దాడి అనంతరం పాక్‌పై వ్యతిరేకత నేపథ్యంలో, జైపూర్‌లోని 'త్యోహార్ స్వీట్స్' యజమాని అంజలీ జైన్ దేశభక్తి ప్రేరణతో ‘మైసూర్ పాక్’ లాంటి స్వీట్లలోని 'పాక్' పదాన్ని...
హృతిక్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం మరచిపోలేనిది: అయాన్
భూసేకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
 ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కన్సల్టేటివ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎంపీ డీకే అరుణ‌
మ‌హిళ‌ల హ‌క్కుల్లో ప్ర‌సూతి సెల‌వులు కీల‌కం!
ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి గట్టి కౌంటర్‌గా నిలిచింది:  కేంద్ర హోం మంత్రి అమిత్ షా
రేప‌టి నుంచి  హైదరాబాద్ మెట్రో ఛార్జీల త‌గ్గింపు...