మ‌హిళ‌ల హ‌క్కుల్లో ప్ర‌సూతి సెల‌వులు కీల‌కం!

   మ‌హిళ‌ల హ‌క్కుల్లో ప్ర‌సూతి సెల‌వులు కీల‌కం!

లోక‌ల్ గైడ్ : 
సుప్రీం కోర్ట్‌: మహిళలకు ప్రసూతి సెలవుల హక్కును మరోసారి సమర్థిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మాతృత్వం, సంతానం కలిగే హక్కులు మహిళల ప్రాథమిక హక్కులలో భాగమని స్పష్టంగా పేర్కొంది. ఏ సంస్థ అయినా ఈ హక్కులను కోల్పోనిచ్చే హక్కు లేదని తేల్చిచెప్పింది.ఈ కేసు తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయినిపై ఆధారపడి ఉంది. ఆమె రెండో వివాహం అనంతరం బిడ్డకు జన్మనివ్వాలన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా, ప్రసూతి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. కారణంగా తమిళనాడు నిబంధనల ప్రకారం మొదటి ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవు వర్తించనిది చెబుతూ అధికారులు అభ్యర్థనను తిరస్కరించారు.అయితే, ఆమె రెండు కాన్పుల సమయంలో ఎలాంటి ప్రసూతి సెలవులు తీసుకోలేదని, ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాతే ఈ ప్రసూతి జరిగింది అని ఆమె న్యాయవాది కేవీ ముత్తుకుమార్ కోర్టులో వివరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆమె మూలహక్కులను ఉల్లంఘించేదిగా ఉందని ఆయన అన్నారు.ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పష్టంగా స్పందిస్తూ, మహిళల మాతృత్వ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, ప్రసూతి సెలవులు అందించకపోవడం సరికాదని తీర్పు ఇచ్చింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 "మైసూర్ పాక్  కాదు మైసూర్ శ్రీ‌..... "మైసూర్ పాక్  కాదు మైసూర్ శ్రీ‌.....
పహల్గాం దాడి అనంతరం పాక్‌పై వ్యతిరేకత నేపథ్యంలో, జైపూర్‌లోని 'త్యోహార్ స్వీట్స్' యజమాని అంజలీ జైన్ దేశభక్తి ప్రేరణతో ‘మైసూర్ పాక్’ లాంటి స్వీట్లలోని 'పాక్' పదాన్ని...
హృతిక్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం మరచిపోలేనిది: అయాన్
భూసేకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
 ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కన్సల్టేటివ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎంపీ డీకే అరుణ‌
మ‌హిళ‌ల హ‌క్కుల్లో ప్ర‌సూతి సెల‌వులు కీల‌కం!
ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి గట్టి కౌంటర్‌గా నిలిచింది:  కేంద్ర హోం మంత్రి అమిత్ షా
రేప‌టి నుంచి  హైదరాబాద్ మెట్రో ఛార్జీల త‌గ్గింపు...