హృతిక్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం మరచిపోలేనిది: అయాన్
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘వార్ 2’ (WAR 2) ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కీలక పాత్రల్లో నటించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమా గురించి తొలిసారి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా నటీనటులపై తనకున్న అనుబంధాన్ని, చిత్రంతో ఉన్న అనుభూతులను పంచుకున్నారు."ఇంకొన్ని వారాల్లో మా సినిమా మీ ముందుకు రాబోతుంది. ఇది చెప్పడానికి ఇప్పుడు సరైన సమయం అనిపిస్తోంది. ఈ కథ నాకు వినిపించిన వెంటనే ఆశ్చర్యపోయాను. అదే ఈ సినిమాను రూపొందించడానికి నాకు స్ఫూర్తినిచ్చింది. నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రేక్షకులు ఈ కథ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను," అని అయాన్ వెల్లడించారు."నా స్నేహితురాలు కియారా అడ్వాణీ (Kiara Advani) నటన అద్భుతంగా ఉంది. అలాగే ఈ రెండు సంవత్సరాలలో ఆదిత్య చోప్రా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. హృతిక్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం మరచిపోలేనిది," అంటూ అయాన్ అన్నారు.
Comment List