"మైసూర్ పాక్  కాదు మైసూర్ శ్రీ‌.....

పహల్గాం దాడి అనంతరం పాక్‌పై వ్యతిరేకత నేపథ్యంలో, జైపూర్‌లోని 'త్యోహార్ స్వీట్స్' యజమాని అంజలీ జైన్ దేశభక్తి ప్రేరణతో ‘మైసూర్ పాక్’ లాంటి స్వీట్లలోని 'పాక్' పదాన్ని ‘శ్రీ’గా మార్చారు. ఇది దేశభక్తిని వ్యక్తీకరించే వినూత్న ప్రయత్నంగా నిలిచింది.

లోక‌ల్ గైడ్ :పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్‌ పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా నిలబెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో మరో వినూత్న చర్చ ఊపందుకుంది—"మైసూర్ పాక్" వంటి స్వీట్ల పేర్లలోని ‘పాక్’ అనే పదాన్ని మార్చాలని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కొందరైతే మీమ్స్‌తోపాటు సీరియస్‌గా ఈ అంశాన్ని చర్చకు తెచ్చారు.ఈ చర్చలో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ప్రముఖ స్వీట్స్ షాప్ 'త్యోహార్ స్వీట్స్' యజమాని వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తమ షాప్‌లో విక్రయించే స్వీట్లలో ‘పాక్’ అనే పదాన్ని తొలగించి, ‘శ్రీ’ అనే పదంతో కొత్త పేర్లు పెట్టారు. ఉదాహరణకు మైసూర్ పాక్‌ను ‘మైసూర్ శ్రీ’, మోతీ పాక్‌ను ‘మోతీ శ్రీ’, ఆమ్ పాక్‌ను ‘ఆమ్ శ్రీ’, గోండ్ పాక్‌ను ‘గోండ్ శ్రీ’గా మార్చారు. అలాగే స్వర్ణ భాషం పాక్‌ను ‘స్వర్ణ శ్రీ’, చాందీ భాషం పాక్‌ను ‘చాందీ శ్రీ’గా పునర్నామీకరణ చేశారు.ఈ సందర్భంగా దుకాణ యజమాని అంజలీ జైన్ మాట్లాడుతూ, “దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో మాత్రమే కాదు. ప్రతి పౌరుడిలోనూ ప్రేమ ఉండాలి. అందుకే మేము ఈ మార్పును తీసుకొచ్చాము,” అని పేర్కొన్నారు.వాస్తవానికి ‘పాక్’ అనే పదానికి పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా, శబ్దసామ్యంతో మనల్ని ఆ దేశాన్ని గుర్తుచేస్తోందన్న భావనను తొలగించేందుకే ఈ పేరు మార్పు చేపట్టామని తెలిపారు. అంతేగాక, ‘శ్రీ’ అనే పదం శుభానికి, పవిత్రతకు ప్రతీకగా భావించే దృష్టితో కొత్తగా ఎంపిక చేశామని అంజలీ జైన్ వివరించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

భారత మౌలిక సదుపాయాల రంగంలో అవినీతి చెరగని ముద్ర: నిర్మాణ నాణ్యతపై తీవ్ర ప్రభావం భారత మౌలిక సదుపాయాల రంగంలో అవినీతి చెరగని ముద్ర: నిర్మాణ నాణ్యతపై తీవ్ర ప్రభావం
హైదరాబాద్:దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల రంగం, అవినీతి, నిర్వాహక లోపాలు, మరియు నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలతో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. పెద్దఎత్తున ప్రజాధనంతో చేపట్టే ప్రాజెక్టులు,...
జగన్-నాయుడు మధ్య రాజకీయ ఉత్కంఠ: లిక్కర్ స్కామ్ వివాదం కొత్త మలుపు
ఆంధ్రప్రదేశ్‌లో మోన్సూన్‌కు పూర్తి సిద్ధం: వ్యవసాయం, నగర వాతావరణం, ఆరోగ్య రక్షణపై ప్రత్యేక చర్యలు
వంగూరి వాచకం -నవరత్నాలు
కవిత లేఖ కలకలం: కేటీఆర్ కీలక మీడియా సమావేశం
ఏకేకు టిఫిన్ కాడ ఎవరయ్య మేజు మల్లి | Ye keku Tipinu Kaada Yeavarayya Meju Malli |Telugu Latest Song
నితి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం: వికసిత్ భారత్ లక్ష్యానికి రాష్ట్రాల భాగస్వామ్యం