హైదరాబాద్‌లో ధరల తాకిడి
ఇటివల తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడ్డాయి. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా ధరలు గణనీయంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9% స్వచ్ఛత) బంగారం ధర 10 గ్రాములకు ₹1,910 పెరిగి ₹98,450కి చేరింది. అఖిల భారత సరఫా అసోసియేషన్ తాజా గణాంకాల ప్రకారం ఇది నమోదైన ధర.
మదుపరులు మళ్లీ పసిడిపై ఆసక్తి చూపడంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వల్ల ఈ ధోరణి కొనసాగుతుందన్నది నిపుణుల అభిప్రాయం. హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి:
-
24 క్యారెట్ బంగారం తులం ధర ₹2,400 పెరిగి ₹97,420కి చేరింది.
-
22 క్యారెట్ బంగారం 10 గ్రాములకు ₹2,200 పెరిగి ₹89,300గా నమోదైంది.
-
వెండి ధర ఢిల్లీలో కిలోకి ₹1,660 పెరిగి ₹99,160కి చేరింది.
పెండ్లిళ్ల సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడం వల్ల బంగారం, వెండి లాంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరిగిందని బులియన్ వ్యాపారవర్గాలు అంటున్నాయి.
Comment List