నేడు గద్వాలకు రానున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్
By Ram Reddy
On
గద్వాల, లోకల్ గైడ్ :
జిల్లాలో మంగళవారం 27న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిటీ సభ్యులతో కలిసి పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితుల సమస్యల పరిష్కారంతో పాటు భూ సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరుపై చర్చించేందుకు సమావేశం నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల సంఘాల నాయకులు తప్పనిసరిగా హాజరై తమ సమస్యల పట్ల కమిషన్ కు వినతి పత్రాలను సమర్పించుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 May 2025 11:41:23
ముల్లాన్‌పూర్, మే 30: ఐపీఎల్ 2025లో ఎలిమినేటర్ మ్యాచ్ ప్రేక్షకులకు హోరాహోరీ పోరును అందించనుంది. ముంబై ఇండియన్స్ (MI) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగే...
Comment List