3 సంవత్సరాలలో ఎస్ ఎల్ బి సి సొరంగం పనులను పూర్తి చేస్తాం.

 రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి

3 సంవత్సరాలలో ఎస్ ఎల్ బి సి సొరంగం పనులను పూర్తి చేస్తాం.

నల్లగొండ.  లోకల్ గైడ్.

    తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, ఇందులో భాగంగానే కోటీశ్వరులు తినే సన్నబియాన్ని పేదలకు అందించడం జరుగుతున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, కనగల్ మండలం, జి .ఎడవెళ్లి గ్రామ  చెరువు కు సుమారు  కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న  మరమ్మతు పనులను ప్రారంభించారు.  జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు,రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా జి .యడవల్లి చెరువు  తూము ,ఇతర పనుల మరమ్మతుకు  గాను కోటి రూపాయలను డి ఎం ఎఫ్ టి ద్వారా మంజూరు చేయడమే కాకుండా, బుధవారం నుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 4000 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్ఎల్ బిసీ సోరంగం పనులు చేపట్టడం జరిగిందని ,అయితే అటువైపునుండి సొరంగం  కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయినప్పటికీ తిరిగి పనులను ప్రారంభించి మూడు ఏళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పారు. ఎడవల్లి గ్రామంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో 80 మందికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగిందని చెప్పారు. దీనితొపాటు, 5 కోట్ల రూపాయలతో బీటి రోడ్లు, 30 లక్షల తో డ్రైనేజీ  మంజూరు చేశామని తెలిపారు. ఎడవల్లి చెరువు మరమ్మతు పనులను  నాణ్యతగా చేపట్టాలని, నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు .కనగల్ ఆస్పత్రిలో గ్లూకోమా కంటి పరీక్షలకై  అధునాతన యంత్రం ఏర్పాటు చేయడం జరిగిందని ,జిల్లా ఆస్పత్రి మాదిరిగా కనగల్ ఆసుపత్రిని  తీర్చిదిద్దడం జరిగిందని వెల్లడించారు. కనగల్ మండల మహిళా  సమాఖ్య సభ్యులకు అయిటి పాములలో లాగే  సోలార్ విద్యుత్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు . ఏవైనా సమస్యలు ఉంటే మండల ప్రజలు  తన దృష్టికి రావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉదయసముద్రం, బ్రాహ్మణ వెల్లేముల తదితర ప్రాజెక్టుల ద్వారా నీరు వృధా కాకుండా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ తో పాటు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి నీటి సద్వినియోగానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు .ఇందులో భాగంగా ఎడవల్లి చెరువు తూము గండి వల్ల నీరు వృధా అవుతున్నదని తెలుసుకొని ఆ చెరువు పనులు మరమ్మతుకు మంత్రి ఆదేశాలతో నిధులు మంజూరు చేయడం జరిగిందని, వచ్చే వానకాలం నాటికి మరమ్మతులను పూర్తి చేసి రైతుల కు చెరువు  నుండిపూర్తి స్థాయిలో నీరు పొందే విధంగా చర్యలు తీసుకుంటామని, అధికారులు నిర్దేశించిన సమయంలో నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు. 30 లక్షలతో ఎడవల్లి గ్రామానికి డ్రైనేజీని మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.గ్రామ పెద్ద, నాయకులు అనంతరెడ్డి మాట్లాడుతూ ఎడవల్లి చెరువు గండిని పూడ్చేందుకు అడిగిన వెంటనే కోటి రూపాయలు మంజూరు చేయడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దొరేపల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డు  లో భాగంగా మిగిలిపోయిన పనులను, అలాగే లక్ష్మీదేవి  గూడెం వరకు నిర్మించే రోడ్డు బ్యాలెన్స్  పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

       ఇంచార్జ్  రెవెన్యూ అదనపు కలెక్టర్  నారాయణ్ అమిత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ, నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ పద్మ, ఇంజనీరింగ్ అధికారులు ,తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఒకరు మ్యాచ్ను అద్భుతంగా ముగించగలడు, మరొకరు అద్భుతంగా ప్రారంభించగలడు వారు ఎవ‌రో తెలుసా.... ఒకరు మ్యాచ్ను అద్భుతంగా ముగించగలడు, మరొకరు అద్భుతంగా ప్రారంభించగలడు వారు ఎవ‌రో తెలుసా....
లోక‌ల్ గైడ్ : ఈరోజు రాత్రి 7:30 గంటలకు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది....
కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి
పుష్కరాల్లో సరస్వతి నవరత్నమాల హారతి
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ జరిమానాలు రూ.12 వేల కోట్లు!
మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ నోటీసులు
“మాకూ టైమ్ వస్తుంది... అప్పుడు చూపిస్తాం”: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు – కొత్త ఆటగాళ్లకు అవకాశాలు