తెలంగాణకు నాలుగు సైనిక్ స్కూళ్లను మంజూరు చేయాలి
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ రక్షణశాఖ మంత్రికి లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నాం
తెలంగాణ గురుకులాల విద్యార్థుల హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొగురం రమేష్
కరీంనగర్ : లోకల్ గై డ్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు సైనిక్ స్కూళ్లను మంజూరు చేయాలని తెలంగాణ గురుకులలా విద్యార్థుల హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొగురం రమేష్ కోరారు. అలాగే తెలంగాణకు సైనిక్ స్కూల్ల విషయంలో కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రక్షణ శాఖ మంత్రి కి లేఖ రాయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. బండి సంజయ్ కుమార్ వెంటనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నాలుగు సైనిక్ స్కూళ్లు ఇచ్చేవరకు తీవ్రంగా కృషి చేయాలని కోరుచున్నాము. ఎందుకంటే తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ఎంతో ఉన్నత స్థాయిలో ఉండటానికి ఆ సైనిక్ స్కూళ్లు ఉపయోగపడతాయి కనుక కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తప్పకుండా ఆ స్కూళ్లు వచ్చేవరకు కృషి చేయాలని తెలంగాణలోని తల్లిదండ్రుల, విద్యార్థుల పక్షాన కోరుచున్నాం.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సైనిక్ స్కూల్ల ను మంజూరు చేసి తెలంగాణ ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని సైనిక్ పాఠశాలను మంజూరు చేయాలని కోరుతున్నాం.
Comment List