యోగతోనే"మంచి ఆరోగ్యం"సాధ్యం.

మండల ఆయుర్వేద వైద్యాధికారిని డాక్టర్ షీలా

యోగతోనే

ఆర్య సమాజంలో ఓకే భూమి ఒకే ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం 

లోకల్ గైడ్ తెలంగాణ, జిల్లేడు చౌదరిగూడెం.

మంచి ఆరోగ్యాన్ని పొందడానికి యోగ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లేడు చౌదరి గూడెం మండల ఆయుర్వేద వైద్యాధికారిని డాక్టర్ షీలా అన్నారు. సోమవారం వారు మండల కేంద్రంలోని ఆర్య సమాజంలో ఆశా వర్కర్లకు స్థానిక ప్రజలకు యోగ చేయుట ద్వారా వచ్చే ఉపయోగాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఆయుర్వేద వైద్యాధికారిని డాక్టర్ శిలా మాట్లాడుతూ ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే కార్యక్రమాన్ని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు, స్థా నిక ప్రజలకు హరిత యోగ ,డైట్ యోగ, యోగ ఆన్ ప్లగ్, యోగా ప్రభావం, యోగ వాగ్ ,యోగ అండ్ అంగీర్ యోగా మేనేజ్మెంట్ వంటి మొదలగు అంశాల పట్ల డాక్టర్ షీలా అవగాహన కల్పించారు. నిత్యం ప్రతి ఒక్కరు యోగాసనాలను నియమ నిబంధనల ప్రకారం చేయుట ద్వారా మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లేడు చౌదరిగూడెం మండల ఆయుర్వేద వైద్యాధికారిని డాక్టర్ షీలా, ఫార్మా టీస్టు చిన్మయనంద, యోగ ట్రైనర్ శ్రీకాంత్, మండల ఆశా వర్కర్లు  అనురాధ,రాణి,యాదమ్మ, రామాంజమ్మ శశికళ, అనసూయ రాములమ్మ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎలిమినేటర్ తుది పరీక్ష: MI, GT మధ్య ప్లేఆఫ్ సమరం ఎలిమినేటర్ తుది పరీక్ష: MI, GT మధ్య ప్లేఆఫ్ సమరం
ముల్లాన్‌పూర్, మే 30: ఐపీఎల్ 2025లో ఎలిమినేటర్ మ్యాచ్ ప్రేక్షకులకు హోరాహోరీ పోరును అందించనుంది. ముంబై ఇండియన్స్ (MI) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగే...
RCB ఘన విజయం
అల్లు అర్జున్ – పుష్ప: ది రూల్ లో అద్భుత ప్రదర్శన
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతల ప్రకటన
చిత్ర పరిచయం: సమాజ దృక్పథాన్ని మార్చే ప్రయత్నం
ఉత్తమ ఫీచర్ సినిమాలు: 2025లో ప్రేక్షకులను కట్టిపడేసిన మూడు చిత్రాలు
హైదరాబాద్‌కు చెందిన హార్వెస్టెడ్ రోబోటిక్స్‌ కంపెనీలో ఉద్యోగుల ఆనందానికి స్పెషల్ ఆఫీసర్!