పద్మపురస్కారాలను అందుకున్న ప్రముఖులు
– రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందజేత
వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన పద్మ పురస్కారాలు మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఘన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందజేయబడ్డాయి.ఈ కార్యక్రమంలో, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్, కతక్ నర్తకి కుముదిని లఖియా తరఫున ఆమె మనుమడు సహాన్ హత్తంగడి, సంగీతకారిణి శారదా సిన్హా తరఫున కుమారుడు అన్షుమన్ సిన్హా (ఇద్దరికీ మరణానంతరం) పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.అలాగే, ప్రముఖ బహుభాషా నటి శోభనా చంద్రకుమార్, పట్టువస్త్రాల వ్యాపార దిగ్గజం నల్లి కుప్పుస్వామి శెట్టి, ఆర్థికవేత్త బిబేక్ డెబ్రాయ్ తరపున ఆయన భార్య సుపర్ణ బెనర్జీ (మరణానంతరం), ఆర్కియాలజిస్ట్ కైలాసనాథ్ దీక్షిత్, సాహిత్య అకాడమీ స్థాపకులు జతిన్ గోస్వామి, మాజీ లోక్సభ స్పీకర్ మనోహర్ జోషీ తరపున కుమారుడు ఉన్మేష్ జోషీ (మరణానంతరం), నటుడు అనంత నాగ్, పాత్రికేయుడు రాంబహదూర్ రాయ్, మరియు ఆధ్యాత్మిక వేత్త సాధ్వీ రితంభర (దీదీగా ప్రసిద్ధి) పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.ఆంధ్రప్రదేశ్ నుంచి సాహిత్యం మరియు విద్యారంగాల విభాగాల్లో కేఎల్ కృష్ణ, వాచస్పతి వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, అలాగే తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల విభాగంలో మంద కృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు.ఈ సందర్భంగా దేశానికి సేవలందించిన వారందరిని రాష్ట్రపతి అభినందించగా, కార్యక్రమం సాంస్కృతిక వైభవంతో జరగింది.
Comment List